ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలపై యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. రష్యా సైనిక చర్య నేపథ్యంలో.. వరుస బాంబు దాడులతో.. వైమానిక దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
ఎటుచూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి.. ఎక్కడ చూసినా బాంబులు మోతే వినిపిస్తుంది. అక్కడి పరిస్థితులపై ఒక్కొక్కరూ ఒక్కోలా నిర్థారనకు వస్తున్నారు. భారతీయ సినీ రాజకీయ ప్రముఖులు సైతం దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత సినీ పరిశ్రమకు ఉక్రెయిన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సుందరమైన ప్రదేశాలున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ఎప్పుడూ వివిధ దేశాల పర్యాటకులతో సందడిగా ఉండే దేశంలో.. మన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ జరిగాయి. టాలీవుడ్ కు ఉక్రెయిన్ తో మంచి అనుబంధం ఉంది.
యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ఈ చిత్రం తెరకెక్కింది. కరోనా నేపథ్యంలో మన దేశంలో షూటింగ్స్ జరుపుకునే పరిస్థితి లేకపోవడంతో.. చిత్ర బృందం మొత్తం అక్కడికి వెళ్ళింది. సుమారు 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా ఓ పాటను చిత్రీకరించారు.
ప్రస్తుతం మిలియన్ల వ్యూస్ తో ఇంటర్ నెట్ ని షేక్ చేస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ అక్కడ షూట్ చేసిందే. ఉక్రెయిన్ లోని ప్యాలెస్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లపై ఈ పాటను షూట్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2022 మార్చి 25న RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' చిత్రానికి కూడా ఉక్రెయిన్ తో సంబంధం ఉంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామాకు సంబంధించిన మెజారిటీ భాగం వీఎఫ్ఎక్స్ వర్క్స్ అక్కడే చేసారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్ వర్క్స్ కు అధిక ప్రాధాన్యత ఉంది. 1970స్ యూరఫ్ బ్యాక్ డ్రాప్ ని వెండి తెర మీద ఆవిష్కరించడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైంది.
ఈ నేపథ్యంలో ఎక్కువ భాగం వీఎఫ్ఎక్స్ ఉక్రెయిన్ లో అనుకున్న సమయంలోనే పూర్తి చేసారని సమాచారం. 2022 మార్చి 11న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.
ఇలా ఉక్రెయిన్ తో సంబంధం కలిగి ఉన్న రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలైన 'ఆర్.ఆర్.ఆర్' - 'రాధే శ్యామ్' మార్చి నెలలో విడుదల కానున్నాయి. అయితే రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్ అతలాకుతలం అవుతున్న సమయంలో ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తుండటం విచారకరం. ఇకపోతే గతంలో సాయి తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన 'విన్నర్' సినిమా షూటింగ్ కూడా ఉక్రెయిన్ లో జరిపారని సమాచారం.