ప్రచారంలో వీళ్లు మాస్టర్లు బాసూ!
ఈ విషయంలో టాలీవుడ్ నుంచి రాజమౌళి, అనీల్ రావిపూడి ముందంజలో ఉన్నారు. వీరిద్దరు సినిమాని డైరెక్టర్ చేయడమే కాదు.
సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం అన్నది డైరెక్టర్లలో అందరికీ సాధ్యం కాదు. దానికి ప్రత్యేకమైన స్ట్రాటజీలు అనుస రించాలి. అలా స్ట్రాటజీ ఉంటే సరిపోదు. దాన్ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ అవ్వాలి. అప్పుడే ఆసినిమా జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఈ విషయంలో టాలీవుడ్ నుంచి రాజమౌళి, అనీల్ రావిపూడి ముందంజలో ఉన్నారు. వీరిద్దరు సినిమాని డైరెక్టర్ చేయడమే కాదు. ప్రచారం కూడా ఎంతో విధిగా బాధ్యతగా ముందుంది రిలీజ్ వరకూ తీసుకెళ్తారు.
తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రచారం ఎలా పొందండంలో వీళ్ల స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా జీరో బడ్జెట్ తోనే కోట్ల రూపాయల పబ్లిసిటీ తెచ్చి పెట్టడం లో వీళ్లు మాస్టర్లు. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' సినిమాల్ని రాజమౌళి ప్రచారం చేసిన తీరు గురించి చెప్పలేదు. అందులో వాడిన కాస్ట్యూమ్స్, ఆయుధాలను ఆన్ లైన్ లో అమ్మానికి పెట్టి సొమ్ము చేసుకోవడంతో పాటు కావాల్సినంత ప్రచారం చేసుకున్నారు. యానిమేటెడ్ పిక్చర్స్ రూపొందించి ఆన్ లైన్ గేమింగ్ సైతం నిర్వహించింది పాన్ ఇండియా కే కాదు పాన్ వరల్డ్ కే తన చిత్రాలు రీచ్ అయ్యేలా చేసారు.
ఇక తదుపరి ఎస్ ఎస్ ఎంబీ 29 సినిమాని మరింత అడ్వాన్స్ గా జక్కన్న ప్రమోట్ చేస్తారు. ఇక అనీల్ రావిపూడి తన సినిమాలో నటించిన నటీనటులతో ఓకాన్సెప్ట్ ను ఎంచుకుని ప్రత్యేకంగా స్కిట్లు చేయించడం అతడి స్పెషాల్టీ. 'సంక్రాంతి కి వస్తున్నాం' సినిమాని జనాల్లోకి అలాగే బలంగా తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. సినిమా రిలీజ్ ముందుకు వరకూ వెకంటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఎవ్వర్నీ వదిలి పెట్టలేదు. ఎవరికీ ఊపిరాడనివ్వ లేదు.
అందుకే సినిమా జనాల్లకి బలంగా వెళ్లింది. గ్రాండ్ సక్సెస్ అయింది. ఇదే తరహాలో బాలీవుడ్ లో నూ కొంత మంది దర్శకులు తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటారు. రాజ్ కుమార్ హిరాణీ, రోహిత్ శెట్టి, ఆయాన్ ముఖర్జీ లాంటి వారు రిలీజ్ ముందు రోజు వరకూ ప్రచారానికి పెద్ద పీట వేస్తారు. వివిధ వేదికలపై తమ సినిమాల్ని ఉచితంగా పబ్లిసిటీ చేసుకుంటారు.