మగాడి తోడు బెడ్ పైనే..జీవితంలో కాదంటోంది!
ఎలాంటి పాత్ర వచ్చిన నో చెప్పకుండా కమిట్ అవ్వడం టబుకే చెల్లింది.
టబు సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా బోల్డ్ పాత్రల విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. బెడ్ రూమ్ సన్నివేశాలు..బాత్ రూమ్ సన్నివేశాల విషయంలోనూ టబు తగ్గదేలే అని నిరూపించింది. యంగ్ హీరోలతో సైతం రొమాంటిక్ పాత్రల్లో నటిస్తూ అలరిస్తుంది. ఎలాంటి పాత్ర వచ్చిన నో చెప్పకుండా కమిట్ అవ్వడం టబుకే చెల్లింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తుంది.
అయితే ఈ బ్యూటీ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. వివాహం అనే బంధానికి దూరంగా ఉంది. తన తోటి నటీమణు లంతా మనవల్ని ఎత్తుకుంటే? టబు మాత్రం ఆ బంధాలకు, బంధావ్యాలకు దూరంగా ఉంది. ఈ విషయంలో అమ్మడు రాంగోపాల్ వర్మ నిబంధనలనే పాటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టబు పెళ్లి గురించి స్పందించింది. పెళ్లికి ఎందుకు దూరంగా ఉన్నారు అంటే? పెళ్లి అవసరం ఏముందని తిరిగి ప్రశ్నించింది.
మగాడి తోడు లేకుండా బాగానే సంతోషంగా జీవిస్తున్నాను అంది. మగాడి తోడు కేవలం బెడ్ రూమ్లో మాత్రమే అవసరమని...జీవితంలో కాదని నిర్మొహ మాటంగా చెప్పేసింది. నాజీవితాన్ని ఎంతో స్వేచ్ఛగా గడుపుతున్నా. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. వివాహం అనే బంధంతో జీవితాన్నిఅక్కడితో ముగించకూడదు అన్ని నా ఉద్దేశం. పెళ్లి చేసుకున్న వారంతా సంతోషంగా ఉన్నారని ఎవరు చెప్పగలరు.
కానీ పెళ్లి చేసుకోని వారు మాత్రం కచ్చితంగా సంతోషంగా ఉండగలరని చెప్పగలను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. పెళ్లి అనేది వారి వ్యక్తిగత విషయం. అలాగని పెళ్లిచేసుకున్న వాళ్లను తప్పు అనను..పెళ్లిచేసుకోని వాళ్లను సమర్దించను కూడా. కేవలం పెళ్లి అనే బంధంతోనే జీవితం ముడిపడి ఉండలేదు. జీవితంలో ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా గుర్తించడం లేదంతే` అని అంది.