పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో!
ఇంకా చెప్పాలంటే? ఈ ఐదారేళ్ల కాలంలో మాలీవుడ్ కంటెంట్ కింగ్ గా సక్సెస్ అవుతుంది.
గత ఏడాది మాలీవుడ్ కి భారీ విజయాలు వరించిన సంగతి తెలిసిందే. మునుపటి కంటే గత ఏడాది అక్కడ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇంకా చెప్పాలంటే? ఈ ఐదారేళ్ల కాలంలో మాలీవుడ్ కంటెంట్ కింగ్ గా సక్సెస్ అవుతుంది. ఆర్ట్ తరహా సినిమాలను పక్కన బెట్టి వాస్తవ కథలు, కమర్శియల్ అంశాలను జొప్పించి సినిమాలు చేయడంతో సక్సెస్ రేట్ పెరిగింది.
ఇలా గత ఏడాది కూడా మాలీవుడ్ లో మంచి విజయాలు నమోదయ్యాయి అన్నది చాలా మంది అభిప్రాయం . కానీ కేరళ చలన చిత్ర నిర్మాతల మండలి రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం చూస్తే మాలీవుడ్ కి గత ఏడాది 700 కోట్ల వరకూ నష్టం వచ్చిందని తేలింది. 2024 లో మొత్తం 199 మలయాళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కేవలం 26 మాత్రమే హిట్ అయ్యాయి. ఓవరాల్ గా అన్ని సినిమాల నిర్మాణానికి అయిన ఖర్చు చూస్తే 1000 కోట్లగా తేలింది.
అందులో 300 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్ల రూపంలో వెనక్కి వచ్చాయి. ఆ లెక్కన మాలీవుడ్ 700 కోట్లు నష్టపోయింది. హిట్ సినిమాల జాబితాలో 'మంజుమ్మల్ బోయ్స్', 'ది గోట్ లైఫ్', 'ఆవేశం', 'ప్రేమలు', 'ఏఆర్ ఎమ్', 'కిష్కింద కాండం', 'గురువారియర్ అంబలనడయిల్', 'వర్షంగళక్కు శేషం' చిత్రాలున్నాయి. ఈ సినిమాల్లో కొన్ని తెలుగులోనూ రిలీయ్యాయి. ఆ చిత్రాలు ఇక్కడా మంచి వసూళ్లను సాధించాయి.
కానీ అసలు సంగతేంటి? అంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువని నివేదికను బట్టి తేలిపోయింది. అయితే హిట్ అనే ప్రచారం వెనుక మరో స్ట్రాటజీ కూడా ఉంది. మాలీవుడ్ అంటే చిన్న పరిశ్రమగా గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు తీయరు. కమర్శియల్ సినిమాలకు దూరంగా ఉంటారు. ఆ రకంగా అక్కడ ఇండస్ట్రీ మిగతా పరిశ్రమ లతో పోలిస్తే వెనుకబడి ఉందన్నది అందరి అభిప్రాయం. కానీ కొన్నిసినిమాలు మంచి విజయం సాధించడంతో? పరిశ్రమ పెద్ద ఎత్తున హైలైట్ అయింది. ఇతర భాషా మీడియా సంస్థలు మాలీవుడ్ ని పైకి లేపాయి. దీంతో మాలీవు డ్ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తుందనే ప్రచారం ఠారెత్తిపోయింది. కానీ కేరళ ఇండస్ట్రీ నివేదిక చూస్తే అన్ని బొక్కలే కనిపిస్తున్నాయి.