తమిళ హీరో సూర్య చేసిన సినిమాల్లో సింగం.. సింగం-2 చాలా స్పెషల్. ఎప్పుడూ కొంచెం క్లాస్ టచ్ ఉన్న క్యారెక్టర్లే చేసే సూర్య.. పూర్తి స్థాయి మాస్ హీరో అవతారమెత్తిన సినిమాలివి. ఈ సినిమాలతోనే అతను మాస్ లోకి చొచ్చుకుపోయాడు. సూర్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో వీటికి స్థానం ఉంది. దీంతో ఈ సిరీస్ లో మూడో సినిమా అనగానే బంపర్ క్రేజ్ వచ్చేసింది. సినిమా మొదలవడంతోనే దీనిపై హైప్ మొదలైంది. ఇక టీజర్.. ట్రైలర్ రిలీజయ్యాక హైప్ మరింత పెరిగింది. అటు తమిళంలో.. ఇటు తెలుగులో ఈ సినిమా కోసం మాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడటంతో ఆ హైప్ నెమ్మదిగా తగ్గిపోతూ వచ్చింది.
డిసెంబరు 16.. డిసెంబరు 23.. జనవరి 26.. లేటెస్టుగా ఫిబ్రవరి 3.. ఇలా మూడుసార్లు డేట్లు మార్చుకుంది ఈ సినిమా. తొలిసారి వాయిదా పడ్డపుడు జనాలు సర్దుకుపోయారు కానీ. రెండోసారి ఏకంగా నెల రోజులకు పైగా సినిమాను పోస్ట్ పోన్ చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో సినిమా మీద బాగా నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. అందుకే జనవరి 26న సినిమా రిలీజవుతుంటే.. ఇంతకుముందున్నంత బజ్ కనిపించలేదు. పైగా 26 నుంచి మళ్లీ వాయిదా అనేసరికి జనాలు ఈ సినిమాను లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 3న అయినా సినిమా వస్తుందని జనాలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చాక చూసుకుందాం అన్నట్లు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ వాయిదాల పర్వం వల్ల కచ్చితంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. సూర్య అండ్ కో ఇప్పుడు ప్రమోషన్లకు వెళ్లినా.. ఎక్కువగా వాయిదాల గురించే మాట్లాడాల్సి వస్తుంది. సినిమా విడుదలకు ముందు మామూలుగా ఉండాల్సిన మూడ్ జనాల్లో లేదిప్పుడు. సినిమా చాలా బాగా ఉంటేనే ఈ నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయి సినిమా హిట్టవుతుంది. కంటెంట్ యావరేజ్ గా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/