మహర్షి గురించి రీమేక్ గాసిప్

Update: 2019-04-30 07:52 GMT
పరిశ్రమలో కొందరి వ్యవహారం వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే తొందరపడి ఒక కోయిల సామెత గుర్తుకువస్తుంది . మే 9న విడుదల కానున్న మహర్షి మీద అప్పుడే రీమేకుల హడావిడి మొదలైపోయింది. ఇది తమిళ్ లో విజయ్ తో రీమేక్ చేస్తారని దిల్ రాజు కోలీవుడ్ లో దీంతో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని ఇలా ఏదేదో చర్చలోకి వస్తోంది.

నిజానికి విజయ్ కు తెలుగు బ్లాక్ బస్టర్స్ మీద మోజెక్కువ. గతంలో అలా చాలా తీసి హిట్లు కొట్టాడు. కాని గత కొంత కాలంగా వాటికి దూరంగా ఉన్నాడు. ఒకవేళ నిజంగా మహర్షి బ్లాక్ బస్టర్ అయితే దాన్ని డబ్ చేసి తమిళ్ లో వదిలేందుకే మహేష్ ఇష్టపడతాడు. ఎందుకంటే తనకు ఎప్పటి నుంచో అక్కడి మార్కెట్ మీద కన్నుంది. అందుకే చాలా రిస్క్ అయినా స్పైడర్ రెండు వెర్షన్లు విడిగా తీయించి అక్కడ డైరెక్ట్ డెబ్యు ఇచ్చాడు. కాని ఫలితం దక్కలేదు

అందుకే మహర్షి ఇక్కడ హిట్ అయితే వీలైనంత త్వరగా డబ్ చేస్తారు కాని విజయ్ లాంటి స్టార్లతో రీమేక్ చేసే అవకాశాలు తక్కువే. మహేష్ కు అక్కడ గుర్తింపు ఉంది. దాదాపుగా అన్ని డబ్బింగ్ చేశారు. ఆఖరికి బ్రహ్మోత్సవాన్ని కూడా వదలలేదు. సో మహర్షి అదే పేరుతో అక్కడికి వెళ్తాడు తప్ప రీమేక్ ఎప్పుడో మానేసిన విజయ్ ఛాయస్ గా ఇది మారడం కష్టమే.

గతంలో ఒక్కడుని గిల్లి పేరుతో అరవంలో చేసిన విజయ్ అక్కడా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పోకిరిని అదే టైటిల్ తో బ్లాక్ బస్టర్ చేసుకున్నాడు. అంత మాత్రాన ఇప్పుడు అంతే ఆసక్తితో మహర్షి వైపు చూస్తాడని అనుకోలేం. ఏది ఎలా ఉన్నా మహర్షి ఫలితం ఇంకో తొమ్మిది రోజుల్లో తేలనుంది
    

Tags:    

Similar News