సినిమా రంగంలో ఇటీవల కాలంలో చాలా మంది యువ హీరోలు సొంతంగా వారి కథలను వారే రాసుకుంటున్నారు. అవసరమైతే కొందరు ఏకంగా దర్శకత్వంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇక మరికొందరు సీనియర్ హీరోలు కూడా అదే తరహాలో ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. గత కొంతకాలంగా దర్శకుడిగా ఎన్నిసార్లు విఫలమైనప్పటికీ కూడా ప్రయత్నాలు ఆపని వారిలో అజయ్ దేవగన్ కూడా ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు అజయ్ దేవగన్ అసలు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచనతో రాలేదట. కానీ ఆ తర్వాత ప్రతి సినిమాకు దర్శకులు చేసే పనిని చూస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు.
ఇక ఆ ఆలోచనతోనే అతను మొదటి సారి 2006లో 'యు మి ఔర్ హమ్' అనే ఒక సినిమా డైరెక్టర్ చేశాడు. ఆ సినిమాలో అతని భార్య కాజోల్ కథానాయకగా నటించింది. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత 'శివాయ్' అనే మరొక సినిమా తీశాడు కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.
కానీ యాక్షన్స్ సీన్స్ లో మాత్రం అజయ్ దేవగన్ మేకింగ్ స్టైల్ చాలా మందికి నచ్చేసింది. ఇక రీసెంట్గా 'రన్ వే 34' అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా నష్టపోయింది. కానీ దర్శకుడిగా మాత్రం అజయ్ దేవగన్ ఫెయిల్ అవ్వలేదు అని ఓటీటీలోకి వచ్చిన తర్వాత అర్థమయింది. ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీ లో మంచి స్పందన లభిస్తుంది.
అయితే అజయ్ దేవగన్ త్వరలోనే మరొక సినిమాను డైరెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అది సొంత కథ కాదు. తమిళంలో సక్సెస్ అయిన ఖైదీ సినిమాను హిందీలో అజయ్ రీమేక్ చేయబోతున్నాడు. హీరోగా అతనే ఫిక్స్ అయిపోయాడు అని ఇంతకుముందే క్లారిటీ వచ్చేసింది.
కానీ దర్శకుడు ఎవరనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అజయ్ దేవగన్ తానే సొంతంగా దర్శకుడిగా మరి ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఈ సినిమా కథలో కొంత మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కథలో హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు. అయినప్పటికీ కూడా టబును రంగంలోకి దించుకున్నారు. మరి అజయ్ దేవగన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.