రేణు.. మ‌రో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు!

Update: 2018-04-08 10:50 GMT
సోష‌ల్ మీడియాలో చురుగ్గా ఉంటే సినీ ప్ర‌ముఖుల్లో రేణు ఒక‌రు. సినిమాల్లో న‌టించ‌టం మానేసి చాలా రోజులే అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌గా ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విడిపోయిన త‌ర్వాత కూడా ప‌వ‌న్ ప‌ట్ల త‌న‌కు అభిమానాన్ని ఆమె త‌ర‌చూ ప్ర‌ద‌ర్శిస్తుంటారు. త‌న మ‌న‌సులోని భావాల్ని పోస్టుల‌తో పంచుకునే ఆమెను ప‌వ‌న్ ఫ్యాన్స్ చాలామంది ఫాలో అవుతుంటారు.

తాజాగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. భావోద్వేగంతో ఉన్న ఈ పోస్ట్ చ‌దివిన వారంతా ఎమోష‌న్ కావాల్సిందే. అకీరా 14వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రేణు పెట్టిన భారీ పోస్ట్‌ లో.. కొడుకు ప‌ట్ల త‌న‌కున్న అభిమానాన్ని.. ఇష్టాన్ని.. ప్రేమ‌ను అపురూపంగా వ్య‌క్తం చేశారు. సున్నిత‌మైన భావాల‌తో ఆక‌ర్షించేలా ఉన్న ఈ పోస్ట్ సారాంశాన్ని క్లుప్తంగా చూస్తే..

సాంకేతికంగా చూస్తే 14 ఏళ్ల వ‌య‌సులో ఉన్న అకీరా కొద్ది రోజుల్లో బాబు కింద‌కు రాడు. కానీ.. ప్ర‌పంచంలో ఏ త‌ల్లికైనా త‌న కొడుకు ఎంత పెద్ద‌వాడైనా.. చిన్న‌పిల్లాడిలానే క‌నిపిస్తాడు. అదే రీతిలో నేను కూడా అకీరాను అలానే చూస్తాను.

ఇద్ద‌రు బ‌ల‌మైన పేరెంట్స్ కు పుట్టిన అకీరా కుటుంబం విజ‌య‌వంత‌మైన నేప‌థ్యం ఉన్న రెండు కుటుంబాల‌కు చెందిన వాడు. తండ్రి త‌రఫు.. త‌ల్లి త‌రఫు  కుటుంబాల అండ అకీరాకు ఉంది.

ఈ పుట్టిన రోజు సంద‌ర్భంగా అకీరా తానే రంగంలో విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాడో అలా అయ్యేందుకు అవ‌స‌ర‌మైన సాయాన్ని త‌ల్లిగా అందిస్తా. త‌న‌కుటుంబ స‌భ్యుల మాదిరి అత‌ను కోరుకున్న రంగాల్లో స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా.నిన్న‌టి రాత్రి నుంచి మీ అంద‌రి నుంచి అందుతున్న పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల్ని అస్వాదిస్తున్నా.
 
Tags:    

Similar News