అకీరా వారసత్వంపై రేణు ఆసక్తికర కామెంట్స్‌

Update: 2019-01-01 13:20 GMT
పవన్‌ నుండి విడిపోయిన తర్వాత అడపా దడపా సినిమాలు చేసుకుంటూ, పిల్లలతో రేణు దేశాయ్‌ తన జీవితాన్ని  గడిపేస్తున్నారు. అప్పుడప్పుడు ఆమె పవన్‌ గురించి మాట్లాడటం చాలా కామన్‌ విషయం. తాజాగా రేణు దేశాయ్‌ రాసిన కవితల సంపుటి పుస్తకం ‘ఎ లవ్‌ - అన్‌ కండీషనల్‌’ ఆవిష్కరణ సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొంది. ఆ సందర్బంగా పలు మీడియా సంస్థలకు రేణు దేశాయ్‌ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మరోసారి తన పిల్లలకు సంబంధించిన విషయాలపై స్పందించింది.

ముఖ్యంగా పవన్‌ తనయుడు అకీరా గురించిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. అకీరాను హీరోగా పరిచయం చేస్తారా అంటూ ఎంతో మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వాడి వయసు 14 ఏళ్లు - ఇప్పుడే వాడికి ఏది ఆసక్తి అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేను. ప్రస్తుతానికి అయితే వాడు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. వాడిలో ఉన్నది మెగా రక్తం - పవన్‌ కళ్యాణ్‌ వారసుడు అంటూ చెప్పుకొచ్చింది.

మెగా హీరోతో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అంటూ రేణు ను ప్రశ్నించిన సమయంలో నా వద్ద ఉన్నది కూడా మెగా హీరోనే కదా అంటూ నవ్వేసింది. చిరంజీవి లాంటి పెద్ద స్టార్‌ వాడి పెదనాన్న - పవన్‌ వంటి వారు వాడి తండ్రి - చరణ్‌ లాంటి బ్రదర్‌ ఉన్న వాడు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఆ రంగంలోకి వాడిని ప్రోత్సహిస్తానంటూ చెప్పుకొచ్చింది. అయితే అభిమానులు మాత్రం అకీరా హీరో అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు.


Tags:    

Similar News