కర్నూలు పర్యటనలో రేణు దేశాయ్

Update: 2019-02-25 06:38 GMT
మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ నటనకు దూరంగా ఉన్నప్పటికీ 2014 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు కానీ.. కొంతకాలం తర్వాత తెలుగులోకి డబ్బింగ్ కూడా చేశారు.  తాజాగా రేణు దేశాయ్ మరో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 

రైతుసమస్యలు కథాంశంగా ఒక సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నానని.. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంగా పర్యటించి వారి సమస్యలను తెలుసుకుంటానని కూడా రేణు దేశాయ్ కొంతకాలం క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే.  తాజాగా ఆమె ఆ పర్యటనను చేపట్టారు.  రేణు దేశాయ్ మొదటగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు.  ఈ పర్యటనలో భాగంగా రేణు ఆదివారం రాత్రికే మంత్రాలయం చేరుకున్నారు.  సోమవారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తారు.  ఆ రైతుల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు.. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు.  

ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు ఆగస్టు 2018 లో.. పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న డిసెంబర్‌ 2018 లో ఆత్మహత్య చేసుకున్నారు.  రేణు దేశాయ్ ఈరోజు ఉదయం తుంబళబీడులోనూ.. మధ్యాహ్నం పెద్దకడబూరులో పర్యటించనున్నారు.   
 
Tags:    

Similar News