సాయి తేజ్ కథానాయకుడిగా దేవాకట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ టీజర్ ఎమోషనల్ ట్రీట్ గురించి తెలిసిందే. ప్రస్తుత అవినీతి అవ్యవస్థ.. రాజకీయ దృశ్యాలకు ప్రతిబింబంగా ఈ టీజర్ కనిపిస్తోంది.
ఈ టీజర్ లో యాథృచ్ఛికమో లేక కావాలని దేవా కట్టా సెలక్షనో కానీ.. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత.. జర్నలిస్ట్ కం క్రిటిక్ జార్జ్ ఆర్వెల్ కొటేషన్ .. ``మా యుగంలో రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది లేదు`` అనే డైలాగ్ ఆలోచింపజేసింది. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్న ఒక వీడియోతో ఇది మ్యాచ్ అయ్యింది.
బాలీవుడ్ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఇంటర్వ్యూలో ``రాజకీయాలకు దూరంగా ఉండటానికి మార్గం లేదు`` అని పవన్ చెప్పడం కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాలు అతని రోజువారీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం రిపబ్లిక్ టీజర్ తో పవన్ వీడియోని జత చేసి అభిమానులు వైరల్ చేస్తున్నారు.
రిపబ్లిక్ కంటెంట్ పరంగా ఉద్దేశపూర్వకంగానే ఇలా తీర్చిదిద్దారా? జనసేనాని పవన్ కల్యాణ్ అభిప్రాయాలు ఆలోచనలతో ఈ సినిమా రూపొందుతోందా? అంటూ డిబేట్ సాగుతోంది. ఇది యాథృచ్ఛికమేనా? అన్న ప్రశ్న కూడా అభిమానుల్లో తలెత్తింది. ఈ ప్రశ్నలన్నిటికీ దేవాకట్టా కానీ సాయి ధమర్ కానీ ఆన్సర్ ఇస్తారేమో చూడాలి. రిపబ్లిక్ తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 4 న విడుదల కానుంది.