ఈ సారి విక్రమ్ కుమార్ కు అది మైనస్సేనా?

Update: 2019-09-05 06:14 GMT
విక్రమ్ కుమార్ కు మొదటి నుంచి మంచి అభిరుచి కల దర్శకుడు అనే పేరుంది.  జయాపజయాలు పక్కన పెడితే ఆయన సినిమాలను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.  అయితే ఈమధ్య విక్రమ్ సినిమాల సక్సెస్ రేట్ తగ్గిపోయింది. చాలామంది క్రిటిక్స్ ఆయనకు ఉదారంగా రివ్యూస్.. ధారాళంగా రేటింగ్స్ ఇస్తున్నటికీ.. సినిమాలు మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు.  విక్రమ్  ప్రస్తుతం 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  దీంతో మరోసారి విక్రమ్ పై అందరి దృష్టి పడింది.

సహజంగా విక్రమ్ సినిమాల్లో కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ ఆడియో మాత్రం సూపర్ హిట్ అవుతుంది. నిజానికి సినిమా విడుదలకు ముందే ఆడియో హిట్ కావడంతో విక్రమ్ సినిమాపై ఒక రకమైన పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది.  అందుకే సినిమాలు కూడా కంటెంట్ తో సంబంధం లేకుండా ఓ మాదిరిగా అడేస్తాయి. మొదటి నుంచి ఇలానే జరుగుతూ వచ్చింది.  అయితే 'నానీస్ గ్యాంగ్ లీడర్' ఆడియోకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఇప్పుడు సడెన్ గా ఆడియన్స్ ను 'నానీస్ గ్యాంగ్ లీడర్' లో ఏదైనా ఒక పాట చెప్పమని అడిగితే చాలామంది చెప్పలేరు.  కానీ గతంలో విక్రమ్ సినిమాల ఆడియోకు రెస్పాన్స్ ఇలా ఉండేది కాదు.

మరి ఈసారి 'గ్యాంగ్ లీడర్' సినిమాపై ఈ ఆడియో ప్రభావం నెగెటివ్ గా ఉంటుందా.. ఈ ఆడియో సినిమాకు మైనస్ అవుతుందా అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి.  పైగా క్వాలిటీ కోసం విక్రమ్ బడ్జెట్ ను కూడా అవసరమైన దానికి మించి ఖర్చు పెట్టిస్తాడనే టాక్ కూడా ఉంది.  మరి ఈసారి గ్యాంగ్ లీడర్ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.  ఈ చిత్రం సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

   

Tags:    

Similar News