రివ్యూ: 365డేస్
రేటింగ్: 2.5/5
తారాగణం: నందు, అనైక శోథి, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ, కృష్ణుడు, సురేఖావాణి, రావి కొండలరావు, గీతాంజలి తదితరులు.
కెమెరా: అనిత్ మాదాడి
సంగీతం: నాగ్ శ్రీవత్సవ్
నిర్మాత: డి.వెంకటేష్ (డి.వి. సినీక్రియేషన్స్)
కథ-కథనం-దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
రామ్‌గోపాల్ వర్మ సినిమా అంటే మాఫియా, ఫ్యాక్షన్, యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్‌లు అనే మనకు ఇన్నాళ్లు తెలుసు. కానీ అతడు ఉన్నట్టుండి రొటీన్ ప్రేమకథల్ని, విడిపోయే జంటల కథల్ని తెరకెక్కించి సందేశాలిస్తాడని అస్సలు ఊహించలేం. కానీ 365డేస్ అనే సినిమా మొదలెట్టినప్పట్నుంచి అతడిలో మార్పు వచ్చిందని అర్థమైంది. ఈసారి ఓ కొత్త ఎటెంప్ట్ చేస్తున్నాడనే అనుకున్నారంతా. అందుకు తగ్గట్టే ముందే టీజర్లలోనే సినిమా కథ మొత్తం ఓపెన్ చేసేశాడు. రెగ్యులర్ టైపికల్ రామూ సినిమా కాదిది.. ఏదో సందేశం చెప్పాలనుకుంటున్నాడు అనిపించింది. ప్రస్తుతం యువజంటలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యని రామూ ఎంత గొప్పగా విశ్లేషించాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
కథ:
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువజంట పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత ఎలా జీవించారు? కొత్తజంట కథ 365 రోజులకే ఏ కంచికి చేరింది? అన్నదే సినిమా. పెళ్లి తర్వాత కలతలు, కల్లోలాలు ఎలా ఉంటాయి? ఒకరికొకరు అర్థం చేసుకోకపోతే కాపురాలు ఎలా కుప్పకూలుతాయి? అన్నదే సినిమా. అర్థం చేసుకుని కాపురం నిలబెట్టుకోవడం కొత్తజంట బాధ్యత అని కూడా సందేశం ఇచ్చారు.
కథనం, విశ్లేషణ:
అపూర్వ్ (అప్పూ) సాఫ్ట్‌వేర ఇంజినీర్. మధ్యతరగతి కుటుంబం. ఫ్యామిలీయే తనలోకం. ఇంతలోనే వన్ ఫైన్‌డే తన స్నేహితుడు ఇచ్చిన పార్టీలో అందమైన శ్రీయని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఇద్దరిమధ్యా స్నేహం కుదిరాక.. తనలోని ఫీలింగ్స్‌ని దాచుకోకుండా ఆ అమ్మాయికి చెప్పేస్తుంటాడు. ప్రేమలో పడ్డాక మొదటిరోజు, తర్వాతి రోజు .. తీయని అనుభూతులతో గాల్లో తేలిపోతుంటాడు. స్నేహంలోనే 25వరోజు ఏకంగా ఓ ముద్దడిగేస్తాడు. ప్రేమ పెళ్లి వరకూ వెళుతుంది. అయితే ఇంతవరకూ సన్నివేశాలన్నీ దొరిల్లపోతేయే కానీ ఎక్కడా కథలోకి తొంగిచూడాలన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించడంలో రామూ విఫలమయ్యాడు. 63వరోజు పెద్దల్ని ఒప్పించి పెళ్లికి ఓకే చేయిస్తారు. 100వ రోజు పెళ్లయిపోతుంది. అంతవరకూ ఫ్లాటుగా మనమంతా ఊహించేసే కథే నడుస్తుంది. తాళిబొట్టు కట్టేవేళ 'విశ్రాంతి-ఇక శాంతి లేదు' అని ఇంటర్వెల్ బ్యాంగ్ వేశాడు రామూ. పెళ్లి తర్వాత ఇద్దరి జీవితాల్లో కల్లోలం మొదలైనట్టేనని ముందే చెప్పేశాడు. దానివల్ల క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేసినా.. అందుకు తగ్గట్టే టేకాఫ్ మాత్రం ద్వితీయార్థంలో కనిపించదు. కొత్త జంట జీవితం రొటీన్‌గానే కలతల వైపు పయనమవుతుంది. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు మొదలవుతాయి. అవి కల్లోలంలా రూపుదిద్దుకుంటాయి. ఈ జంట కాపురంలో ఇతరుల సలహాలు కూడా నిప్పులు పోస్తుంటాయి.
ఇవన్నీ నిత్యం మనం చూసేవాటిని యథాతథంగా చూపించాడంతే. 147వరోజుకి వచ్చేప్పటికి ఒకరికొకరు బోర్ కొట్టేస్తారు. 235వ రోజుకి చేరేప్పటికి మావోళ్లు-మీవోళ్లు అటూ తిట్టుకోవడం మొదలవుతుంది. ఒకరి టార్చర్ ఇంకొకరు భరించలేనంతగా పరిస్థితి మారిపోతుంది. 325వ రోజు పోర్న్ సినిమా చూసి దొరికిపోయిన భర్తను భరించలేకపోతుంది. 365రోజుల్లో విడాకులతో విడిపోతారు. ఆ తర్వాత మళ్లీ ఏడాదికి రియలైజేషన్. మళ్లీ కలుసుకుని కాపురం మొదలుపెట్టి పిల్లల్ని కని సంతోషంగా ఉంటారు. అయితే ఈ కథను రామూ చెప్పిన తీరు ఏమంత ఆసక్తికరం అనిపించదు. ఒక సన్నివేశం తర్వాత ఒక సన్నివేశం వచ్చి వెళ్తుంటాయి తప్ప అప్పటికప్పుడు ఏదైనా ఉత్కంఠ, మలుపులు ఉంటాయోమోనని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. పైగా ఆ ఇద్దరిమధ్యా విడిపోయేంత పెద్ద సమస్య ఏం వచ్చిందో చూపించడంలో విఫలమయ్యాడు. రామ్‌గోపాల్ వర్మ సినిమాల్లో కాస్త పేలవమైన స్క్రీన్‌ప్లే ఇది. అతడు తెరకెక్కించిన అనగనగా ఒకరోజు సినిమాలో ప్రేమికుల మధ్య కనిపించే టింజ్ ఈ సినిమాలో ఒక్కచోటా కనిపించదు. ఏదో రొటీన్ ప్రేమికుల్నే చూపించాడనిపిస్తుంది. ప్రేమలో ఉన్నప్పటి సన్నివేశాల్లో ప్రేమలోని ఫీల్‌ని అంత అందంగా క్యారీ చేయలేకపోయాడు.
నటీనటులు:
నందు, అనైక ఇద్దరూ నవతరం అబ్బాయి, అమ్మాయిలకు ప్రతిరూపంలా చక్కగా చాలా సహజంగా పాత్రల్లోకి ఒదిగిపోయారు. నందు స్నేహితుడిగా కృష్ణుడు బాగానే నటించినా అతడిలో మునుపటి ఈజ్ కనిపించలేదనిపించింది. అనైక మంచి కోరే ఇల్లాలి పాత్రలో సత్యకృష్ణ నటన రొటీన్ అనిపిస్తుంది. అస్సలు పెళ్లే వద్దురా అని భోదించే జగ్జీత్ పాత్రలో పోసాని కృష్ణమురళి (హీరో ఆఫీసులో బాసు) అద్భుతంగా అభినయించారు. 498ఎ గృహహింస చట్టం గురించి, మొగుడు పెళ్లాల గొడవల గురించి పోసాని చెప్పిన తీరు బాగా నవ్విస్తుంది.
ఈ పాత్రలన్నీ పెళ్లి అనే టాపిక్‌ని చర్చించడానికి ఉపకారం అయ్యాయి. మిగతా నటీనటులంతా సహాయకపాత్రల్లో వారి పరిధిమేరకు ప్రవర్తించారు. ఈ సినిమాలో నందు నటన పరంగా పరిణతి చెందాడు. ఎందుకంటే అతడు కూడా పెళ్లి తర్వాత నటించిన సినిమా ఇది. అనైక అందాలు కుర్రకారుకు కనువిందు చేస్తాయి. .
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకి శ్రీవత్సవ సంగీతం చక్కగా కుదిరింది. ముఖ్యంగా రీరికార్డింగ్ హైలైట్. అలాగే సిరాశ్రీ రాసిన అందానికే నిర్వచనం అనే పాట హైలైట్. ఈ పాటలో సినిమాటోగ్రఫీ కూడా అంతే అందంగా కనిపించింది. పాటలన్నిటినీ సందర్భానుసారం ఉపయోగించడంలో వర్మ తెలివైనవాడన్నది కాదనలేం. మిగతా విభాగాలు ఎవరి పని వాళ్లు చేసుకుపోయారు.
ప్లస్ పాయింట్స్:
సహజంగా చూపించాలనుకోవడం. పరిమిత బడ్జెట్‌తో సినిమా తీయగలగడం. రామూలోని పిచ్చితనం చూపించకపోవడం, అసభ్యత లేకపోవడం.
మైనస్ పాయింట్స్:
కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు లేకపోవడం. కామెడీ అనుకున్నంత పేలకపోవడం. అస్సలు ట్విస్టులు, ఆసక్తికలిగించే ఏ ఒక్క అంశం లేకపోవడం. అంతేకాదు
చివరిగా...
మరీ అంత చెత్త కాదు. అలాగని గొప్ప సినిమా కూడా కాదు. కొత్త జంటలు ఒకరినొకరు తరచి చూసుకోవడానికి ఈ సినిమాని రిఫరెన్సుగా చూసుకోవచ్చు..