దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ దొరికితే చాలు.. చెలరేగిపోతుంటాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సబ్జెక్టే అయనకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రూపంలో దొరికింది. తమ సినిమానే ఒరిజినల్ ఎన్టీఆర్ బయోపిక్ అని..నిజాలు అన్నీ తమ సినిమాలో ఉంటాయని.. పెద్దాయన దీవెనలు కూడా తమకే ఉంటాయని బల్లగుద్దిమరీ చెపుతున్న వర్మ తాజాగా ఈ మరోసారి ట్విట్టర్ ద్వారా సెన్సేషనల్ ట్వీట్లు చేశాడు.
ఈమధ్యే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల తేదీ 'ఎన్టీఆర్ మహానాయకుడు' మీదే ఆధారపడి ఉందని ఓపెన్ గా క్లారిటీ ఇచ్చిన వర్మ తాజాగా చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా డైరెక్ట్ గా తీసుకొచ్చాడు. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది కట్టుకథ.. సీబీఎన్ ఎందుకు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు అన్నది నిజం. ఆ నిజమేంటో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో తెలుసుకోండి" అంటూ ట్వీట్ చేశాడు.
ఆయన అంతటితో ఆగలేదు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా పబ్లిసిటీ కాంపెయిన్ ట్యాగ్ లైన్ 'హూ బ్యాక్ స్టాబ్డ్ ఎన్టీఆర్(ఎన్టీఆర్ ను ఎవరు వెన్నుపోటు పొడిచారు)?' అని కూడా ట్వీట్ చేశాడు. ఈ ఇంగ్లీష్ వాక్యంలో అన్ని అక్షరాలు నలుపు రంగులో ఉంటే సిబీఎన్ అక్షరాలు మాత్రం ఎరుపు రంగులో ఉన్నాయి. అంటే.. ప్రశ్నలోనే సమాధానం ఉందన్నమాట.