ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదం రోజురోజుకు ముదరుతోంది. ఇప్పటికే ఈ అంశం మీద పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేయగా.. ఇప్పుడు సీన్ లోకి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వచ్చారు. లాజిక్స్ - ఎకనామిక్స్ బయటకు తీసి ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమాధానాలకు తిరిగి ప్రశ్నలు వేస్తూ కౌంటర్ మీద కౌంటర్ ఇస్తున్నారు. టికెట్ ధరలు నియంత్రించడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఏపీ సర్కార్ వెర్సెస్ ఆర్జీవీ గా మారిపోయింది.
రామ్ గోపాల్ వర్మ గత మూడు రోజులుగా ఏపీలో టికెట్ రేట్ల అంశం మీద మీడియాలో సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని - ఆర్జీవీ మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. మధ్యలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎంట్రీ ఇచ్చి.. వర్మను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. అయితే కొడాలి నాని ఎవరో తనకు తెలియదని ట్విట్టర్ వేదికగా విలక్షణ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తాజాగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. ''ఏపీ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు'' అని వ్యగ్యంగా పేర్కొన్నారు. దీనికి హీరో నాని ని కూడా ట్యాగ్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది.
రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందిస్తూ.. 'రాష్ట్రంలో ప్రస్తుతం మా పార్టీ అధికారంలో ఉంది. ప్రజలే మాకు ఈ అధికారాన్ని అప్పగించారు. పక్క రాష్ట్రంలో కూర్చొని అక్కడ సినిమాలు తీసుకుంటున్న వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకే మేము జవాబుదారీతనంగా ఉంటాం. రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమా టికెట్ ధరల్లో ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వాళ్లనే అమ్ముకోమని చెప్పండి. చూద్దాం'' అని అన్నారు. ఈ క్రమంలోనే నాని కామెంట్స్ కు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు.
ఇకపోతే ఇటీవల ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా విడుదల సమయంలో ఏపీలో టికెట్ ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దానిపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ.. ''నాకు తెలుగు రాష్ట్రాల్లో కొడాలి నాని ఒక్కరే తెలుసు. ఈ నాని ఎవరో నాకు తెలియదు'' అని అన్నారు. ఇప్పుడు అదే తరహాలో రామ్ గోపాల్ వర్మ తనకు కొడాలి నాని ఎవరో తెలియదని.. హీరో నాని మాత్రమే తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం.