రామ్ చరణ్ మీద సడెన్ గా రామ్ గోపాల్ వర్మ..!

Update: 2022-12-08 05:08 GMT
టాలెంట్ బోలెడంత ఉన్నా దాన్ని సరైన మార్గంలో కాకుండా ఎలా పడితే అలా వాడుకుంటాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. పాతికేళ్ల క్రితం శివ తో తన నెక్స్ట్ లెవల్ థాట్ ని చూపించి అందరిని మెప్పించిన ఆర్జీవి ఆ తర్వాత తన మార్క్ సినిమాలు చేస్తూ వచ్చారు.

బాలీవుడ్ లో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలను తీశారు వర్మ. అయితే ఈమధ్య ఆయన స్థాయికి తగిన సినిమాలు చేయట్లేదని తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన డేంజరస్ అనే ఒక లెస్బియన్ లవ్ స్టోరీ మూవీ తీశారు. ఆ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలి నటించారు.

అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ ని బాగా చేస్తున్నారు ఆర్జీవి. బిగ్ బాస్ తో పాపులర్ అయిన అషు రెడ్డితో కూడా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ రీసెంట్ గా చేశారు. ఆ ఇంటర్వ్యూలో అసలు విషయం కన్నా అషు అందాల మీదే ఆర్జీవి ఎక్కువ ఫోకస్ చేశాడు. ఇక చూస్తుంటే వర్మ నెక్స్ట్ సినిమాలో అషునే హీరోయిన్ గా చేస్తుందని చెప్పొచ్చు. డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ మీద తన కామెంట్ వదిలారు వర్మ.

చరణ్ ఒక జెంటిమెన్ గా చాలా పర్ఫెక్ట్ అని అన్నారు.. ఎలాంటి గొడవలకు వెళ్లే వ్యక్తి కాదు.. అలా ఉండటం బోరింగ్ గా అనిపిస్తుంది అయినా చరణ్ స్టార్ గా తన సినిమాల్లో పాత్రలు.. ఎంచుకునే సినిమాలు అన్ని అద్భుతంగా ఉన్నాయని అన్నారు.

మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున లేచే వర్మ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. తాను పవన్ కళ్యాణ్ కి బీభత్సమైన ఫ్యాన్ అని చెబుతూనే పవన్ మీద సెటైరికల్ పంచులు.. సినిమాలు చేస్తాడు. ఇక ఇప్పుడు అతని కన్ను చరణ్ మీద పడ్డది. చరణ్ గురించి ఆర్జీవి పొగుడుతుంటే మెగా ఫ్యాన్స్ మాత్రం ఇదేదో తేడా కొడుతుందే అనుకుంటున్నారు.  

అంతేకాదు వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో.. ఎవరిని టార్గెట్ చేస్తాడో అతనికే తెలియదు అని అంటున్నారు. తను తీసిన డెంజరస్ సినిమాకు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్న ఆర్జీవి దానికి తగినట్టుగా సినిమా రిజల్ట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News