వ‌ర్మ‌కు ఈసారి అరెస్ట్ త‌ప్ప‌దా?

Update: 2018-02-02 04:49 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ వెన్నంటే వివాదాలు ఉంటాయి. త‌న‌దైన తీరుతో ఏ విష‌యం మీద‌నైనా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టే అల‌వాటున్న వ‌ర్మ తొలిసారి పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందా? అంటే..అవున‌ని చెబుతున్నారు.

వ‌ర్మ పేరుతో ఇప్ప‌టికి ఎన్నో వివాదాలు న‌డుస్తున్నా.. ఏ రోజూ ఆయ‌న పోలీసు విచార‌ణ లాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కోలేదు. తాజాగా ఆయ‌న తీసిన పెద్ద‌ల సినిమా జీఎస్టీ ఇష్యూలో మాత్రం ఇబ్బందులు త‌ప్పేలా లేవు. డిజిట‌ల్ ప్ర‌పంచంలో వ‌ర్మ విడుద‌ల చేసిన జీఎస్టీ మూవీని డిలీట్ చేయాల్సిందిగా సైబ‌రాబాద్ పోలీసుల నుంచి తాఖీదు వెళ్లింది.

ఇదే విష‌యాన్ని సైబ‌ర్ క్రైమ్ అడిష‌న‌ల్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ.. జీఎస్టీ మూవీ ఇష్యూలో ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌ను క‌చ్ఛితంగా విచారించ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ విచార‌ణ‌లో వ‌ర్మ కానీ త‌ప్పు చేసిన‌ట్లుగా అనిపిస్తే అరెస్ట్ చేస్తామ‌న్నారు. ఇప్ప‌టికే జీఎస్టీ మూవీని అప్ లోడ్ చేసిన వీవియో సంస్థ‌కు లేఖ పంపామ‌ని.. పోర్న్ కంటెంట్ ఉన్న జీఎస్టీని బ్యాన్ చేయాల‌ని తాము చెప్పిన‌ట్లు డీసీపీ ర‌ఘువీర్ వెల్ల‌డించారు.

ఇదే విష‌యాన్ని ఆర్జీవీ సైట్ కు కూడా స‌మాచారం అందించామ‌న్నారు. ఇదిలా ఉంటే.. జీఎస్టీ మీద ఫేక్ న్యూస్ న‌డుస్తోంద‌ని.. దాన్ని న‌మ్మొద్ద‌ని వ‌ర్మ స్ప‌ష్టం చేస్తున్నారు. జీఎస్టీ నిర్మాత‌ల నుంచి ఫిర్యాదు రావ‌టంతోనే దాన్ని తొల‌గించిన‌ట్లు చెప్పిన వ‌ర్మ‌.. వీవియో ఓ పైర‌సీ సైట్ గా తేల్చారు.  జీఎస్టీ నిర్మాత‌లు త‌మ ఒరిజిన‌ల్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచిన‌ట్లు చెప్పారు. ఏమైనా.. ఎన్నో వివాదాల్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న వ‌ర్మ‌.. జీఎస్టీ ఎపిసోడ్ లో సైబ‌ర్ పోలీసుల విచార‌ణ‌ను ఎలా ఎదుర్కొంటార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News