వివాదాస్పద అంశాలని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఎక్కడ వివదాం వుంటే అక్కడ వాలిపోతూ దాన్నే తన సినిమాకు కథావస్తువుగా మలుచుకుంటూ గత కొన్నేళ్లుగా బండిని నెట్టుకొస్తున్నాడు. `ద ఎటాక్స్ ఆఫ్ 26 /11, వీరప్పన్ వంటి సినిమాల తరువాత వర్మ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
ఆయనని దగ్గరగా గమనించిన వాళ్లు వర్మ `ద ఎటాక్స్ ఆఫ్ 26 /11, వీరప్పన్ సినిమాల తరువాత డైరెక్షన్ చేయలేదని, మిగతా క్రూతో నెట్టుకొస్తూ వున్నాడని బాహాటంగానే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వర్మ చేసిన `కొండా` సినిమాపై కూడా ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా వర్మ చేసిన చిత్రమిది. వరంగల్ కు చెందిన కొండా దంపతులు కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథ ఆధారంగా ఈ మూవీని వర్మ తెరకెక్కించాడు. ఈ మధ్య నట్టికుమార్ చెప్పినట్టు సినిమా కోసం ప్యాకేజీని తీసుకుని తూతూ మంత్రంగా సినిమాని చుట్టేయడం అనే స్కీమ్ ని వర్మ పెట్టుకున్నారని విమర్శలు చేశారు. కొండా సినిమా చూసిన వారు ఇది అక్షరాలా నిజమని చెబుతున్నారు.
రక్త చరిత్ర,వీరప్పన్, వంగవీటీ వంటి బయోపిక్ లని తెరకెక్కించిన వర్మ అందులో సగం క్వాలిటీని కూడా `కొండా` సినిమా నిర్మాణంలో చూపించలేదని చెబుతున్నారు. కథని, కథనాన్ని నడిపించే విధానంలోనూ రొడ్డ కొట్టుడు ఫార్ములానే వర్మ అనుసరించాడట. కొండా పాత్రని పవర్ ఫుల్ గా మలచకపోవడం, కథలోని బలమైన ఎమోషన్స్ ని క్యారీ చేయలేకపోయాడని చెబుతున్నారు. త్రిగుణ్ పై వున్న శ్రద్ద అతని పాత్రపై వర్మ చూపించలేదట.
దీంతో పవర్ ఫుల్ గా వుండాల్సిన కొండా పాత్ర నీరుగారిపోయిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. నరేషన్ విషయంలో నూ వర్మ సిల్లీగా వ్యవహరించి స్రేక్షకులకు విసుగు పుట్టించేలా చేశాడట. ఓవరాల్ గా ఒరిజినల్ స్టోరీ ప్రకారం సంచలనం సృష్టించాల్సిన కొండా కథని తన పేలవమైన మేకింగ్ టేకింగ్ లతో వర్మ నీరుగార్చేశాడని, వర్మ చేసిన సినిమాల్లో `కొండా` బిలో యావరేజ్ మూవీగా నిలిచిందని బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.
నిర్మాణం మరీ నాసిరకంగా వుందని, కాస్టింగ్ తో పాటు కథను నడిపించే విషయంలో వర్మ మరిన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేదని, తన నుంచి ఇకపై ఇంతకు మించి కూడా ఆశించలేమని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.