పైసా ఖర్చు లేకుండా తన సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీని కాబట్టడంలో రామ్ గోపాల్ వర్మని మించిన తోపు లేరన్నది అందరికి తెలిసిందే. గత కొంత కాలంగా ఇదే ఫార్ములాని అప్లై చేస్తూ పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియాలో వివాదాల కారణంగా తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని రాబట్టుకుంటున్నారు వర్మ. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తను రూపొందించిన చిత్రాలకు పబ్లిసిటీ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తుంటే వర్మ మాత్రం పైసా ఖర్చు లేకుండా తన సినిమాలని వైరల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇది నిన్నటి మాట. ప్రస్తుతం ట్రెండు మారింది. ఫ్రీగా పబ్లిసిటీ చేసినా.. కాంట్రవర్సీలు సృష్టించినా రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి మాట్లాడే పరిస్థితిలో కానీ పట్టించుకునే పరిస్థితిలో కానీ ప్రేక్షకులు లేరు. గత కొంత కాలంగా వర్మ ఎన్ని పబ్లిసిటీ జిమ్మిక్కులు చేసినా ఆయన సినిమాల చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదు. థియేటర్ల గేట్ ముఖం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు.
ఈ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన బయోపిక్ `కొండా` గురించి ఎక్కడా మాట్లాడుకోవడం లేదు. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. వరంగల్ కు చెందిన కీలక రాజకీయ నేతలు కొండా మురళి, కొండా సురేఖల జీవిత కథ ఆధారంగా ఈ మూవీని వర్మ తెరకెక్కించాడు.
కొందా మురళి, తెరాస నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఈ మూవీ చిత్రీకరణ సమయంలో మాటల యుద్ధం జరిగింది. దీనిపై కొండా సురేఖ చేత పలు వివాదాస్ప వీడియోలని కూడా వర్మ విడుదల చేయించాడు. పరుశంగా మాట్లాడుతూ కొండా సురేఖ్ తెరాస నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై విరుచుకుపడిన వీడియోలు ఆ మధ్య నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే అవేవీ జూన్ 23న విడుదలవుతున్న `కొండా` మూవీకి హైప్ ని క్రియేట్ చేయలేకపోయాయి. అంతే కాకుండా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి తెలంగాణ పీసీసీ అధినేత రేవంత్ రెడ్డిని ఆహ్వానించి కొంత హైప్ ని క్రియేట్ చేయాలని వర్మ చేసిన ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయింది. మీడియా పబ్లిసిటీ పరంగా కూడా ఈ మూవీని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రతి సినిమాకు వర్మ చేసే జిమ్మిక్కులు `కొండా` సినిమా విషయంలో పారడం లేదు.
పబ్లిసిటీకే తోపు అనిపించుకున్న వర్మ ఎలాంటి డబ్బులు ఖర్చు చేయకుండా ఇన్నాళ్లూ తన సినిమాకు పబ్లిసిటీని క్రియేట్ చేసుకుని తన సత్తా చాటిన వర్మ `కొండా` విషయంలో మాత్రం ఫెయిల్ కావడం గమనార్హం. గత కొన్ని రోజులుగా `కొండా` కు సంబంధించిన పబ్లిసిటీ చేస్తున్నా మీడియా వర్గాల్లో చాలా మందికే ఈ మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలియలేదంటే పబ్లిసిటీ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు అని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. మరి కొంత మందేమో పబ్లిసిటీకే తోపు అని చెప్పుకున్న వర్మ `కొండా` మూవీకి బజ్ ని క్రియేట్ చేయడంలో దారుణంగా ఫెయిలయ్యాడని కామెంట్ లు చేస్తున్నారు.