వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఆర్జీవీ బయోపిక్ మూడు భాగాలుగా రాబోతోంది. దొరసాయి తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ బయోపిక్ ని బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. ''రాము'' ''రామ్ గోపాల్ వర్మ'' ''ఆర్.జి.వి'' అనే టైటిల్స్ తో ఈ మూడు సినిమాలు రానున్నాయి. 'ఆర్.జి.వి' సినిమాలో ఆర్జీవీయే స్వయంగా నటించనున్నాడు. ఇక ఆర్జీవీ బయోపిక్ లో వర్మ విజయవాడ కాలేజ్ డేస్.. 'శివ' సినిమా చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు.. ఎవర్ని ఎలా మాయ చేసి వాడుకున్నాడు.. వర్మ ముంబై జీవితంలో అమ్మాయిలు.. గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ తో ఆయనకున్న అనుబంధం.. ఆర్జీవీ వివాదాలు.. దేవుళ్ళ పట్ల, శృంగారం పట్ల, సమాజం పట్ల ఆయనకి ఉన్న విపరీత వైఖరులతో పాటు.. అతని ఫెయిల్యూర్స్.. ఇతరుల మీద ఆర్జీవీ ప్రభావం వంటివి చూపించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పడు ఆర్జీవీ బయోపిక్ పై ఇండస్ట్రీ వర్గాల్లో సినీ అభిమానుల్లో నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా గొప్ప వాళ్ళ బయోపిక్ లు తీస్తే స్ఫూర్తి దాయకంగా ఉంటాయని.. సమాజం పట్ల బాధ్యతలేని రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తుల బయోపిక్ వల్ల ఎవరికి ఉపయోగమని విమర్శిస్తున్నారు. సమాజం కారణంగా మనుగడ సాగిస్తూ ఆ సమాజానికి జవాబుదారీ కాదని నిస్సిగ్గుగా చెప్పే ఆర్జీవీ లాంటి చీడ పురుగు మీద సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఆయన లైఫ్ స్టోరీ ఏదో 'గాడ్ ఫాదర్' రేంజ్ లో ఉండబోతోందని మూడు సినిమాలుగా తీస్తున్నారని.. ఇప్పుడు టాలీవుడ్ లో వర్మపై తీస్తున్న సినిమాలన్నీ ఆయన నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తీస్తున్నవేగా అని కామెంట్స్ చేస్తున్నారు. తన బయోపిక్ తానే తీసుకుంటానని వర్మ ప్రకటించాక కూడా ఇప్పుడు ఇంకో పార్టీ వర్మ బయోపిక్ ని తీస్తూ ఆర్జీవీకి భలే పబ్లిసిటీ ఇస్తున్నారని అంటున్నారు. ఇంతకముందు ఎన్టీఆర్ జీవిత గాథపై పోటీపడి సినిమాలు తీసినట్లు.. ఇప్పుడు ఆర్జీవీ బయోపిక్ అంటూ సినిమాలు తీస్తున్నారని.. అయినా పిచ్చోడి మీద ఇన్ని సినిమాలు తీసేవారికైనా బుద్ధి ఉండాలని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.