వివరాల కోసం ఎన్టీఆర్ ను సంప్రదించలేదు: వర్మ

Update: 2019-04-01 06:40 GMT
ఎన్నికల ప్రచారానికి సంబంధించిన హడావుడి రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా ఉన్నప్పటికీ దానిని మించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.  ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఈ సినిమా మిగతా అన్ని చోట్ల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాపై చంద్రబాబు వ్యతిరేకులు పండగ చేసుకుంటుంటే.. మద్దతుదారులు మాత్రం మండిపడుతున్నారు.  జనవరిలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకు లేని ఆసక్తి ఈ సినిమాపై వ్యక్తం అవుతోందనే విషయం మాత్రం వాస్తవం.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' తో అన్నీ నిజాలే చెప్పానని.. ఎన్టీఆర్ ను దగ్గరగా చూసిన పలువురు వ్యక్తుల ద్వారా ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేసి స్క్రీన్ ప్లే రూపొందించానని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే చెప్పాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులలో కొందరికి కీలక పాత్రలు ఉన్నాయి. చంద్రబాబును పూర్తిగా నెగెటివ్ గా చూపించగా  హరికృష్ణ.. బాలకృష్ణ.. పురందేశ్వరి పాత్రలను కూడా నెగెటివ్ యాంగిల్ లోనే చూపించాడు ఆర్జీవీ.  ఇదిలా ఉంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందని మొదట్లో వార్తలు వినిపించాయి కానీ సినిమా రిలీజ్ తర్వాత అవి జస్ట్ స్పెక్యులేషన్స్ అని తేలిపోయింది.

'టెంపర్' షూటింగ్ సమయంలో రామ్ గోపాల్ వర్మతో ఎన్టీఆర్ కాస్త క్లోజ్ గానే మూవ్ అయ్యాడనే వార్తలు వినిపించాయి.  మరి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం చాలామందిని సంప్రదించి వివరాలు సేకరించిన వర్మ వివరాల కోసం జూనియర్ ఎన్టీఆర్ ను కూడా సంప్రదించాడా? ఇదే విషయం వర్మను అడిగితే.. సంప్రదించలేదు అని చెప్పాడు.  ఈ సంఘటనలు జరిగిన సమయంలో ఎన్టీఆర్ చాలా చిన్నవాడని.. కుటుంబంలో జరిగే విషయాలను అర్థం చేసుకునేంత వయసు తనకు లేదని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లేకుండానే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ను పూర్తి చేసింది అందుకేనేమో.
    

Tags:    

Similar News