చాలా తెలివిగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటున్న వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ ని పదే పదే హై లైట్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ ని ఇంకా టార్చర్ పెడుతున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నాక ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆయన పతనంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత అనేదాని మీదే వర్మ ఫోకస్ పెట్టాడు. షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చే స్టేజి లో ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పుడిలా ఎన్టీఆర్ లైఫ్ ని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు.
ఆయన బ్రతికున్నప్పుడే టిడిపి విధి విధానాలు నచ్చక కృష్ణ స్వయంగా కొన్ని వెనుక ఉండి కొన్ని సినిమాలు తీయించారు. అప్పట్లో అవి సంచలనం అయ్యాయి కూడా. సాహసమే నా ఊపిరి-నా పిలుపే ప్రభంజనం-గండిపేట రహస్యం-మండలాధీశుడు వీటన్నంటిలోనూ ఎన్టీఆర్ ను నేరుగా విలన్ గా చూపిస్తూ ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఈ పాత్రలు వేసిన థర్టీ ఇయర్స్ పృథ్వి-కోట శ్రీనివాసరావుల మీద దాడులు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. కృష్ణ మొదటి రెండిట్లో హీరోగా నటిస్తే విజయ నిర్మల గారు మూడు సినిమాల్లో కనిపిస్తారు. ఓసారి ఏదో సభలో ఎన్టీఆర్ విజయనిర్మల తారసపడితే అన్ని తీశారా ఇంకా బాలన్స్ ఏమైనా ఉన్నాయా అని నవ్వుతూ ప్రశ్నించారట.
కథ ఇక్కడితో అయిపోలేదు అప్పుడు. 1990లో బాలచందర్ ను ఎన్టీఆర్ ను పోలిన పాత్రలో చూపిస్తూ నటుడు ప్రదీప్ శక్తి స్వయంగా కలియుగ విశ్వామిత్ర అనే వ్యంగ్య సినిమా తీసాడు. అందులో రమ్య కృష్ణ హీరొయిన్. ఇది కూడా వివాదాస్పదం అయ్యింది. కాని సక్సెస్ కాలేదు. పిసి శ్రీరామ్ దీనికి ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. అంటే ముప్పై ఏళ్ళ క్రితమే వర్మ ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎన్టీఆర్ అప్పుడు ఉన్నారు.ఇప్పుడు లేరు. ఒకవేళ ఉన్నాదీన్ని అంత సీరియస్ గా పట్టించుకునే వారు కాదేమో. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు వీలైనంత హైప్ తీసుకురావడానికి వర్మ శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ట్విట్టర్ ని వేదికగా మార్చుకుని నానా రచ్చ చేస్తున్నాడు. దీని ట్రైలర్ రావాలంటే మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించాలి అని మెలిక పెట్టిన సంగతి తెలిసిందే