రాజమౌళి ఛాలెంజ్‌ ను తిరష్కరించిన వర్మ

Update: 2020-11-11 11:30 GMT
ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్‌ ఆ తర్వాత చరణ్‌ ను నామినేట్‌ చేశాడు. కాస్త ఆలస్యంగా ఇటీవల చరణ్‌ మొక్కలు నాటి తన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం మెంబర్స్‌ అయిన జక్కన్న రాజమౌళి.. హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇంకా అభిమానులను ఛాలెంజ్‌ చేశాడు. చరణ్‌ ఛాలెంజ్‌ ను స్వీకరించిన జక్కన్న నేడు తన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అందరితో కలిసి మొక్కలు నాటాడు. ఈ ఛాలెంజ్ లో భాగంగా మళ్లీ ఇతరులను కూడా ఛాలెంజ్‌ చేయాల్సి ఉంది. కనుక రాజమౌళి మొక్కలు నాటిన ఫొటోను ట్వీట్‌ చేసి రామ్‌ గోపాల్‌ వర్మ.. వివి వినాయక్‌.. పూరిలను నామినేట్‌ చేసి ఈ ఛాలెంజ్‌ ను ముందుకు తీసుకు వెళ్లమంటూ కోరాడు.

రాజమౌళి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ చేసిన గంటలోనే వర్మ స్పందించాడు. తాను ఇలాంటి ఛాలెంజ్‌ లను స్వీకరించలేను అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. నేను గ్రీన్‌ ఛాలెంజ్‌ లో భాగంగా లేదా మరే ఛాలెంజ్‌ లో భాగంగా అయినా మట్టిన ముట్టుకునేందుకు అస్సలు ఆసక్తిని చూపించను. నాకు మట్టిని తాకడం అంటే అసహ్యం. మొక్కలు అనేవి కేవలం మంచి వ్యక్తులకు మాత్రమే అర్హమైనవిగా నా అభిప్రాయం. నాలాంటి స్వార్థ పరులకు ఆ మొక్కలు సూట్‌ కావు అన్నాడు.

మీకు మీ మొక్కలుకు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లోనే ఒక అరుదైన ట్వీట్‌ ను వర్మ చేసి అందరిని ఆశ్చర్యపర్చాడు. అందరిలా వర్మ కూడా మొక్కలు నాటితే ఆయనకు ఇతరులకు తేడా ఏముంటుంది. ఖచ్చితంగా ఆయన ఇతరులకు విభిన్నంగా ఉంటాడు అనేందుకు ఇది మరో ఉదాహరణ అంటూ ఆయన అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News