హుజూరాబాద్ ఎలక్షన్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

Update: 2021-11-02 05:09 GMT
ఆయనో సంచలన డైరెక్టర్.. యధార్థ ఘటనలను సినిమాలుగా చూపించే డిఫరెంట్ రైటర్.. ఆయన మాట్లాడినా వివాదమే.. సైలెన్స్ గా ఉన్న సంచలనమే.. ట్వీట్ చేస్తే వార్..కామెంట్ చేస్తే రచ్చ రచ్చ.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో ప్రత్యేకం. తెలుగు నుంచి హీందీ వరకు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన వాళ్లు ఎక్కువే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు సైతం ఆర్జీవి సినిమాకు వద్దనకుండా నటించేస్తారు. ఇక ఆర్జీవీ సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సంఘటనలపై స్పందిస్తారు. ముఖ్యంగా క్రైమ్ న్యూస్ అంటే ఈ డైరెక్టర్ కు బాగా ఇష్టం. అంతేస్థాయిలో పోలిటికల్ రంగంపై కూడా అప్పుడప్పుడు స్పందిస్తారు. తాజాగా ఆయన హుజూరాబాద్ ఎన్నికపై స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తెలంగాణ యావత్తు హుజూరాబాద్ వైపు చూస్తోంది. నేటి రిజల్ట్ తో ఎవరు విజేతో తేలిపోనున్నారు. ఈ నేపథ్యంలో కేవలం రాజకీయ నాయకులే కాకుండా సామాన్యులు కూడా పొద్దన్నే టీవీముందు వాలిపోయారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ హుజూరాబాద్ ఎన్నికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ వాస్తవానికి హుజూరాబాద్ ఎన్నికపై నేనే ఏం మాట్లాడలేదు. కానీ నాకు హుజూరాబాద్ ఎన్నికతో సంబంధం పెట్టి కొందరుప్రచారం చేస్తున్నారు. నేనేం చేయకపోయినా నన్ను వివాదంలోకి లాగుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికపై నేనేం మాట్లాడగలను. కానీ కొందరు నాపేరు వాడుకుంటున్నారు.’ అని వర్మ తెలిపారు.

ఇక వర్మ డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడుతూ ‘డ్రగ్స్ విచారణ నిత్యం జరుగుతూనే ఉంటుంది. కానీ సెలబ్రెటీలు అరెస్టు అయినప్పుడు మాత్రమే ఫోకస్ చేస్తారు. ఎక్కువ వీరిపై ఫోకస్ చేసి క్యాష్ చేసుకుంటారు. సుశాంత్ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ వరకు కేవలం సినీ నటులు పట్టుబడితేనే హైలెట్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్లు కూడా పట్టుబడుతున్నారు. పోలీసులు విచారణ చేసి వారు డ్రగ్స్ దోషులైతే శిక్షలు వేస్తారు.. లేదంటే విడిచిపెడతారు. కానీ రోజూ వారి గురించి ఇంతలా హైలెట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీడియా ఈ వ్యవహారంపై మరీ ఫోకస్ పెడుతోంది. కానీ అంతకుమించిన సమస్యలు దేశంలో అనేకంగా ఉన్నాయి.’ అని అన్నారు.

‘ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా బాగా ఎక్కువ చేస్తోంది. ప్రతి ఒక్కరికి వాయిస్ సోషల్ మీడియా ఉండడంతో ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. దీని వల్ల మంచేదో.. చెడేదో ఎవరికి అర్థం కాకుండా పోతుంది. ఉదాహరణకు సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని విచారించారు. అయితే ఆమెకు డ్రగ్స్ తో సంబంధం ఉందో.. లేదో.. ఇప్పటికీ తెలియదు. ఈ క్రమంలో పోలీసులు మారుతున్నారు. కేసు టైం పోడిగిస్తున్నారు. కానీ విషయం నిర్దారణ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి నచ్చినట్లు వారు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా కేవలం వాయిస్ వినిపించాడానికి మాత్రమే. సమస్యలకు పరిస్కారం కాదు. ’

‘ఆర్యన్ ఖాన్ అరెస్టు ఎన్సీబీకి పబ్లిసిటీ మాత్రమే అవుతుంది. ఆయన తీసుకున్నాడా.. లేదా..? అనేది ఇన్నర్ విషయం. కానీ ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే ఇలాంటి చర్యలు ఉంటాయని చెప్పడానికే ఇలా సెలబ్రెటీలను అరెస్టు చేస్తారని అనుకుంటున్నాను. ఇదొక అడ్వర్టయిజ్ మెంట్ ఫిలం లాగా అయిపోయింది. దీని వల్ల నిజంగా డ్రగ్స్ తీసుకునేవారు జాగ్రత్తపడి పోలీసులకు దొరకకుండా ఉంటున్నారు. నేనొకతన్ని అడిగానే డ్రగ్స్ తీసుకుంటే పోలీసులు పట్టుకుంటారు.. కదా.. అంటే నన్నేందుకు పట్టుకుంటారు.. నేనేమైనా సెలబ్రెటీనా..? అని అన్నాడు. ఇలా అసలు వాళ్లు దొరకకుండా పోతున్నారు’ అని ఆర్జీవి అన్నారు.


Tags:    

Similar News