సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఓ కామెంట్ చేసినా ట్వీట్ చేసినా సినిమా తీసినా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను నమ్మిన దాని మీద నిలబడతాడు. అందుకే ఆయనని కాంట్రవర్సీ కింగ్ అని పిలుస్తారు. ఇండస్ట్రీకి వర్మ ఎన్నో కొత్త ఆలోచనలు కలగించడంతో పాటు న్యూ టెక్నాలజీలను ఇంట్రడ్యూస్ చేసారు. సినిమా తీయడానికి పెద్ద కెమెరాలు అవసరం లేదని ఓ 5డీ క్యామ్ తో సినిమా తీయొచ్చని చూపించాడు. మేకర్స్ అందరూ కరోనాకి భయపడి ఇంటి నుండి బయటకు రావడానికి కూడా ఆలోచిస్తుంటే వర్మ మాత్రం కరోనా నన్నేమి చేస్తుందంటూ అరడజను చిత్రాలను లైన్లో పెట్టాడు. సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్స్ అవసరం లేదంటూ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఓన్ ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసి తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే 'క్లైమాక్స్' 'నగ్నం' 'పవర్ స్టార్' అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వర్మ ''థ్రిల్లర్'' ''మర్డర్'' ''కరోనా'' అనే సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే న్యూ జోనర్ ని తీసుకురాబోతున్నామని ఆర్జీవీ ప్రకటించారు. FR జోనర్ లో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ. ఫిక్షనల్ రియాలిటీలో కూడా వర్మ కాంట్రవర్సీని మాత్రం వదలడం లేదు. నిజ జీవిత పాత్రలను గుర్తు చేసేలా క్యారెక్టర్స్ పేర్లు పెట్టాడు.
కాగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. ''ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే జోనర్ ని నేను RgvWorldTheatre లో కనిపెడుతున్నాను. సినిమాలు కల్పితం అయ్యుండొచ్చు లేదా నిజమైన కథలు కావచ్చు లేదా వాస్తవాల ఆధారంగా ఉండవచ్చు.. FR అనేది రియల్ పీపుల్ మరియు రియల్ సిట్యుయేషన్స్ ఆధారంగా తీసుకోబడిన పాత్రలతో రూపొందే కల్పిత కథ'' అని చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ సినిమా విశేషాలు వెల్లడిస్తూ ''ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో నా ఫిక్షనల్ రియాలిటీ చిత్రం పేరు 'ఆర్జీవీ మిస్సింగ్'. స్టోరీ ఐడియా ఏంటంటే ఆర్జీవీ మిస్సింగ్ అని తెలిసిన ఆర్జీవీ కంపెనీ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. మొదట్లో పోలీసులు ఇది ఆ వివాదాస్పద డైరెక్టర్ పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తారు. చివరికి అది సీరియస్ అని రియలైజ్ అవుతారు. అప్పుడు ఆర్జీవీ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు.. 1 పవర్ఫుల్ స్టార్ యొక్క అభిమానులు.. 2 ముంబై అండర్ వరల్డ్ కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. 3 ఒక మాజీ ముఖ్యమంత్రి మరియు ఫ్యాక్షనిస్టుల సహాయం తీసుకునే అతని కుమారుడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెడతారు'' అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ - ఒమేగా స్టార్ - సీబెఎన్ (CBEN) - లాకేష్ - WHY S జగన్ - KCAR - KTAR తో పాటు పోలీసులు గ్యాంగ్ స్టర్స్ ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారని.. ఈ ఎఫ్.ఆర్ చిత్రం కోసం వేచి ఉండండి అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ ప్రముఖులను వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.