వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఏమి చేయకపోయినా కాంట్రవర్సీ అవుతుంది. అది ట్వీట్ అయినా సినిమా ఓపెనింగ్ అయినా అంతే. మంగళవారం ''కొండా'' మూవీ షూటింగ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో వరంగల్ కు వెళ్లిన ఆర్జీవీ.. చిత్ర యూనిట్ తో కలిసి స్థానిక గండి మైసమ్మ టెంపుల్ ను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి విస్క తాగిస్తున్నానని ట్విట్టర్ వేదికగా రాము వెల్లడించారు.
''నేను వోడ్కా మాత్రమే తాగినప్పటికీ.. మైసమ్మ దేవతను విస్కీ తాగేలా చేసాను'' అంటూ రాం గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ఫోటోని షేర్ చేశారు. 'చీర్స్' అంటూ మరో ట్వీట్ పెట్టారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుళ్లపై నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ కించపరచవద్దని కామెంట్స్ పెడుతున్నారు. అయితే వర్మ అక్కడి ఆచారం ప్రకారమే గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించి (సాక) ఆశీస్సులు అందుకున్నాడని తెలుస్తోంది.
కాగా, "కొండా'' చిత్రాన్ని తెలంగాణ రాజకీయ నేపథ్యంలో కొండా మురళి - సురేఖల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు వర్మ. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా ఆర్జీవీ ఇప్పటికే విడుదల చేశారు. వరంగల్ లో 1980ల నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను వర్మ ఈ సినిమాలో చూపించబోటున్నారు. కొండా మురళి పాత్రలో అరుణ్ అదిత్ కనిపించనున్నాడు. కొండా సురేఖ పాత్రలో 'భైరవగీత' ఫేమ్ ఇర్రా మోర్ నటించనుంది.
"కొండా'' సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా వరంగల్ కు వచ్చిన రామ్ గోపాల్ వర్మ లు కొండా సురేఖ హారతిచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత కొండా దంపతులలతో ఆర్జీవీ కాసేపు ముచ్చటించారు. అక్కడి వంచనగిరి గ్రామంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు వర్మ. ఈ సందర్భంగా ముందుగా వర్మ కొండా ర్యాలీని ప్లాన్ చేయగా.. పోలీసులు అనుమతి నిరాకరించారని తెలుస్తోంది.
నిజ జీవిత సంఘటనలు.. బయోపిక్ లను సినిమాలుగా తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మ కు సాటి లేరు. సినీ రాజకీయ ప్రముఖుల రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర నుంచి శృంగార తారల లైఫ్ స్టోరీలు - గ్యాంగ్ స్టర్ జీవితాల ఆధారంగా ఎన్నో సినిమాలు తీశారు. 'రక్త చరిత్ర' 'మర్డర్' 'సర్కార్' 'లక్ష్మీస్ ఎన్టీఆర్' 'దిశ' వంటి సినిమాలు ఇలా వచ్చినవే. మరి ఇప్పుడు కొండా సురేఖ దంపతుల జీవితం మీద ఆర్జీవీ తీస్తున్న ''కొండా'' సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.