13వ రోజు తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలివే

ఇదిలా ఉంటే రెండో వారంలో 13వ రోజు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా చూసుకుంటే 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంది.

Update: 2024-12-18 12:35 GMT

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఆడియన్స్ తెలుగు సినిమాల కోసం ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యే స్టార్ హీరోల సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ ని ప్రేక్షకులు అందిస్తున్నారు.

'పుష్ప 2' మూవీతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా 13 రోజుల్లోనే 1400+ కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడం ద్వారా సరికొత్త రికార్డులని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ ఎంత వేగంగా ఈ కలెక్షన్స్ మార్క్ ని టచ్ చేయలేదు. 'బాహుబలి 2' కూడా స్లో ఫేజ్ లోనే వసూళ్లు అందుకుంది. అయితే 'పుష్ప 2' మాత్రం అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ నిలకడగా సాగుతున్నాయి.

13వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో 1.88 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో 19.50 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ఇదిలా ఉంటే రెండో వారంలో 13వ రోజు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమా చూసుకుంటే 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమాకి ఏకంగా 4.68 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో స్థానంలో అనూహ్యంగా సాయి దుర్గా తేజ్ 'ప్రతిరోజు పండగే' మూవీ ఉండటం విశేషం. ఈ సినిమాకి 13వ రోజు 2.91 కోట్లు షేర్ లభించింది.

మూడో స్థానంలో ఉన్న 'ఆర్ఆర్ఆర్' 2.54 కోట్ల వసూళ్లు సాధించింది. నాలుగో స్థానంలో 1.98 కోట్ల షేర్ తో 'బాహుబలి' మూవీ ఉంది. 'పుష్ప 2' సినిమా 13వ రోజు 1.88 కోట్లు షేర్ అందుకొని టాప్ 5లోకి వచ్చింది. దీని తర్వాత 'దేవర' ఉంది. ఇక హిందీలో 'పుష్ప 2' 600+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటేసింది. హిందీలో సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం కేవలం 50 లక్షల గ్రాస్ మాత్రమే తగ్గింది. ఇదిలా తెలుగు రాష్ట్రాలలో 13వ రోజు అత్యధిక షేర్ వసూళ్లు చేసిన టాప్ 10 సినిమాల జాబితా ఇలా ఉంది.

బాహుబలి 2 - 4.68Cr

ప్రతిరోజు పండగే - 2.91Cr

ఆర్ఆర్ఆర్ – 2.54CR

బాహుబలి – 1.98Cr

పుష్ప 2 ది రూల్ – 1.88Cr~*******

దేవర పార్ట్ 1 – 1.74Cr

శతమానంభవతి - 1.72Cr

మహర్షి - 1.58Cr

అల వైకుంఠపురంలో -1.58Cr

జనతా గ్యారేజ్ - 1.57Cr

Tags:    

Similar News