బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ మృతి కేసులో భాగంగా డ్రగ్స్ వ్యవహారంపై మూడు రోజుల విచారణ అనంతరం రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా అరెస్ట్ చేశారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు.
అయితే ఎన్సీబీ అధికారుల విచారణలో వీరిద్దరూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వారు చెప్పిన వివరాల ప్రకారం కరోనా లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో సుశాంత్ సింగ్.. రియా చక్రవర్తితో కలిసి కొన్ని రోజులు ఆమె ఇంట్లోనే ఉండాలనుకున్నాడట. అందుకోసం సుశాంత్ - రియా కలిసి 500 గ్రాముల మాదకద్రవ్యాలను ప్యాక్ చేసి కొరియర్ లో ఇంటికి పంపించాలనుకున్నారట. అయితే ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ ను కొన్ని సామాన్లతో కలిపి పార్మిల్ చేశారట. అనంతరం సుశాంత్ దగ్గర పనిచేసే దిపేశ్ సావంత్ కొరియర్ బాయ్ తో రియా ఇంటికి ఆ పార్శిల్ ను పంపించగా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి దాన్ని తీసుకున్నట్లు విచారణలో తేలిందని సమాచారం. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సదరు కొరియర్ ఏజెన్సీని మరియు కొరియర్ బాయ్ ని కూడా విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా రియా చక్రవర్తి ఈ కేసు విచారణలో 25 మంది సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించునట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రియా బయటపెట్టిన లిస్ట్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ పేర్లు కుడా ఉన్నాయని చెప్తుండటంతో బాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శాండిల్ వుడ్ లో కూడా డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతోంది. తీగ లాగితే డొంక కదులుతున్నట్లు రోజుకో మలుపు తిరుగుతోంది. కన్నడ సీమలో సినీ స్టార్స్ పెద్ద ఎత్తున డ్రగ్స్ దందాతో లింకులు కలిగి ఉన్నారని బెంగుళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గల్రానీ లను అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.