జైల్లో రియా : చాప మీద నిద్ర.. ఫ్యాన్‌ కూడా లేదు

Update: 2020-09-12 06:00 GMT
సుశాంత్‌ మరణించిన రోజు నుండి ఆమె డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న రోజుల్లో కూడా జాతీయ మీడియా ఆమెను వదిలి పెట్టడం లేదు. రియాతో మాట్లడేందుకు ఆమె బైట్‌ తీసుకునేందుకు ఆమె ఇంటి వద్ద రోజులో 24 గంటలు మీడియా ప్రతినిధులు పడిగాపులు కాచారు. రియా ఇంటి నుండి బయటకు వెళ్లినా బయట నుండి ఇంట్లోకి వచ్చినా ఆమెను వెంటాడుతూనే ఉన్నారు. ఆమె పై జాతీయ మీడియా చూపించిన శ్రద్దకు దేశ వ్యాప్తంగా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టు కూడా రియా విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

ఇప్పుడు రియా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి ముంబయిలోని మహిళ జైల్లో ఉంది. అక్కడ నుండి కూడా మీడియా రిపోర్టింగ్‌ మొదలు పెట్టింది. మొదటి రోజు ఆమె ఏం తిన్నది.. ఆమె ఎలా ఉంది.. ఏం చేస్తుంది అనే విషయాలను జాతీయ మీడియాలో ప్రముఖ ప్రియార్టీ ఇచ్చి మరీ ప్రసారం చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థ రియా జైలు జీవితం గురించి ఒక కథనం ప్రసారం చేసింది. అందులో రియాకు అధికారులు ఒక చాప మాత్రమే ఇచ్చారు. కనీసం ఒక దిండు కూడా ఇవ్వలేదు. ఇక ఆమెకు కేటాయించిన రూంలో కనీసం ఫ్యాన్ కూడా లేదు.

కోర్టు నుండి ప్రత్యేక అనుమతి తెచ్చుకుంటే  తప్ప ఆమెకు టేబుల్‌ ఫ్యాన్‌ సమకూర్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారట. నేలపై ఫ్యాన్‌ లేకుండా కనీసం దిండు కూడా లేకుండా రియా పడుకుంటుందని సదరు కథనంలో పేర్కొనడం జరిగింది. ఇక ఆమెకు అందరితో పాటు సమానంగా రోజులో రెండు సార్లు పాలను అందిస్తున్నారట. ప్రస్తుతం కరోనా టైం కనుక ఇమ్యూనిటీ పెంచుకునేందుకు పండ్లు కూడా ఇస్తున్నట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు. రియా జైలు జీవితం గురించి వారు ప్రచారం చేసిన కథనం పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి కొందరు రియా విషయంలో జాలీ చూపిస్తున్నారు.
Tags:    

Similar News