పుష్ప 'పీలింగ్స్'.. యూట్యూబ్ లో ఓ రేంజ్ లో!

సినిమాలోని అన్ని పాటల కన్నా పీలింగ్స్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది.

Update: 2025-01-06 22:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2: ది రూల్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా.. వాటిని అందుకుని ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

అయితే పుష్ప-1కు మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాదే సీక్వెల్ కు కూడా వర్క్ చేశారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫిదా చేశారు. ముఖ్యంగా సాంగ్స్ ను మేకర్స్.. థియేట్రికల్ రిలీజ్ కు ముందు విడుదల చేయగా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వేరే లెవెల్ లో సందడి చేశాయి.

రిలీజ్ అయ్యి 32 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ పుష్ప-2 సాంగ్స్ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి. తాజాగా పీలింగ్స్ సాంగ్.. యూట్యూబ్ లో క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. సినిమాలోని అన్ని పాటల కన్నా పీలింగ్స్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. మరో మైలురాయిని అందుకునేలా దూసుకుపోతోంది.

నిజానికి పుష్ప-2 మేకర్స్.. కిస్సిక్, పీలింగ్స్ సాంగ్స్ ను లేట్ గా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు పీలింగ్స్ పాట.. రికార్డ్ లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంది. దీని బట్టి పుష్ప-2 ఆల్బమ్ అంతటిలో పీలింగ్స్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుందో క్లియర్ గా తెలుస్తోంది. అందులో రష్మిక తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారనే చెప్పాలి.

సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కానీ ఆమె మాత్రం తన అందం, హావభావాలు, డ్యాన్స్ తో మెప్పించారు. అల్లు అర్జున్ తన స్టెప్పులతో అలరించారు. ఆ సాంగ్ కు తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మీదాస ప్రాణం పోశారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తన టాలెంట్ తో సాంగ్ కు మరింత అందాన్ని చేర్చారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. బన్నీ, రష్మికతో పాటు ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటివరకు రూ.1831 కోట్లు వసూలు చేసి బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసి సందడి చేస్తోంది పుష్ప-2.

Tags:    

Similar News