ఒక పాపులర్ హీరోయిన్ కిడ్నాప్ కేసులో మలయాళం హీరో దిలీప్ జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు వల్ల అతనిని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) నుండి తొలగించారు. కానీ కొత్తగా ప్రెసిడెంటుగా ఎన్నికైన మోహన్ లాల్ దిలీప్ కు మళ్ళీ మెంబెర్ షిప్ ఇచ్చారు. దీనితో కొపమొచ్చిన కొందరు హీరోయిన్లు AMMA నుండి స్వయంగా తప్పుకున్నారు.
దిలీప్ ను మరల AMMA మెంబరుగా తీసుకున్న విషయం తెలిసిన వెంటనే రీమ కలింగల్ - రెమ్యా నాంబీసన్ మరియు గీతు మోహన్ దాస్ AMMA నుండి రిజైన్ చేశారు. దిలీప్ వల్ల ఎవరైతే బాధపడ్డారో - ఆ హీరోయిన్ కూడా రిజైన్ చేసిందని చెప్పాల్సిన అవసరం లేదు. రెసిగ్నేషన్ లో "ఆ యాక్టర్ ఇదివరకు నాకు రావాల్సిన చాలా కారెక్టర్లను రాకుండా చేశాడు. నేను AMMA కు కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. నాపైన ఒక దుర్ఘటన జరిగినప్పటికీ నేను మెంబరుగా ఉన్న ఈ ఆర్గనైజేషన్ అతనిని కాపాడటానికి ప్రయత్నిస్తోంది. కనుక నేను ఇక AMMA లో మెంబరుగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే రిజైన్ చేస్తున్నాను"అంటూ కారణం పేర్కొనడం జరిగింది.
"మీడియా నుండి ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యాను. అతనిని మరల తీసుకునే ముందు వాళ్ళకి అతని బాధితురాలు గుర్తురాలేదు" అంటూ రెమ్యా తిట్టిపొయ్యగా "నేను కేవలం ఈ ఒక్క సమస్య వలన మాత్రమే కాదు కనీసం మా తరువాతి తరం వాళ్ళైనా ధైర్యంగా, ఆత్మ గౌరవంతో బతకగలరు అనే ఆశతో వెళ్ళిపోతున్నాను." అంటూ చెప్పుకొచ్చారు రీమా.