న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు భామలు ఆడిపాడనున్నారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ అయింది.
నాని-విక్రమ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం దర్శకుడు విక్రమ్ మైత్రీవారి ముందు భారీ బడ్జెట్ ప్రపోజలే పెట్టాడని సమాచారం. ఈ సినిమాకు రూ.50 కోట్ల బడ్జెట్ కావాలని అడిగాడట. ఈ రేంజ్ బడ్జెట్ నాని మార్కెట్ కు ఎక్కువే. నాని సినిమాలు సూపర్ హిట్ అయితే 30 నుండి 40 కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తాయి. ఒకవేళ సినిమా అటూ ఇటూ అయితే మాత్రం 'దేవదాస్'.. 'కృష్ణార్జున యుద్ధం' తరహాలో 20 కోట్లకు అటూ ఇటుగా సరిపెట్టుకోవలిసి ఉంటుంది. అలాంటిది నాని సినిమాకు రూ.50 కోట్ల బడ్జెట్ అంటే సినిమా తప్పని సరిగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావలిసిందే.
నాని మార్కెట్ ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద విక్రమ్ ట్రాక్ రికార్డ్ కూడా గొప్పగా లేదు. సూర్య '24'.. అఖిల్ 'హలో' సినిమాలు రెండూ కాస్ట్ ఫెయిల్యూర్లే. బడ్జెట్ అదుపులో ఉన్నట్టైతే వాటికీ ఫ్లాప్ ముద్ర తప్పేది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మైత్రీ వారు యాభై కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయితే ఖచ్చితంగా రిస్క్ చేస్తున్నట్టేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి విక్రమ్ ఏ విధంగా వారిని గట్టెక్కిస్తాడో వేచి చూడాలి.