ఫోటో స్టోరి: న్యూ ఇయర్ ట్రిప్పులో..

Update: 2018-01-04 10:57 GMT
చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోవడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పాలి. అయితే కొంత మంది అమ్మాయిలు ముందు తెరపై కనిపించాలని ఆసక్తితో మంచి క్యారెక్టర్ దొరికితే వెంటనే చేసేస్తున్నారు. ఆ తరువాత మెల్లగా అందంలో మార్పులు చేస్తూ స్టైలిష్ లుక్స్ తో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఆ తరహాలో ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతోన్న బ్యూటీ రీతూ వర్మ.

బాద్షా సినిమాలో చిన్న క్యారెక్టర్  చేసిన ఈ బ్యూటీ రెండు సినిమాలను చేసి ఆ తరువాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మంచి అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తానికి పెళ్లి చూపులు సినిమాలో సింపుల్ గా నటించేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కేశవా కూడా హిట్ అయ్యింది. ఆ తరువాత తమిళ్ లో ఛాన్సులను అందుకుంటూ తన ఇమేజ్ ను పెంచుకుంటూ వస్తోంది. ఇకపోతే ఇటీవల రీతూ ఇచ్చిన ఫొటో స్టీల్ అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.

అయితే ఎక్కువగా గ్లామర్ డోస్ గీత దాటకుండా స్టైలిష్ గా కనిపించడానికి ట్రై చేస్తుంది. ఇక రీసెంట్ గా చాలా రోజుల గ్యాప్ తరువాత సింగపూర్ కి వెళ్లింది. న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని తన స్టైల్ లో ఎంజాయ్ చేస్తోందట. గాగుల్స్ పెట్టుకొని ఉన్న హాట్ గ్లామర్ ఫోటో నెటిజన్స్ ని పిచ్చెక్కిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం రీతూ మూడు తమిళ సినిమాల్లో నటిస్తోంది.
Tags:    

Similar News