బికినిలో సెగలు రేపుతున్న బాలీవుడ్ భామ..

Update: 2020-04-05 02:30 GMT
బాలీవుడ్ లో అరుదుగా కనిపించే హాట్ బ్యూటీ రియా సేన్ సోషల్ మీడియాలో మాత్రం సంచలనం రేపుతుంటుంది. హిందీ - మలయాళ - ఒరియా - బెంగాలీ - తెలుగు చిత్రాల్లో నటించిన రియా ఫోటో షూట్లతో అగ్గిరాజేస్తుంది. బాయ్‌ ఫ్రెండ్ శివమ్ తివారీని పెళ్లి చేసుకొన్న తర్వాత దాదాపు బాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. అప్పట్లో హానీమూన్ ఫొటోలను సోషల్ మీడియాలో గుప్పించి సంచలనం రేపింది. నిజానికి రియా సేన్ ఎవరో కాదు. ప్రఖ్యాత నటి సుచిత్రా సేన్ మనువరాలు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల చిత్రంలో నటించిన మున్ మున్ సేన్ కూతురు. మరో బాలీవుడ్ నటి రైమా సేన్ రియా సోదరి. తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని 1991లో విషకన్య అనే చిత్రంలో బాలతారగా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి మంచిపేరు సంపాదించుకుంది.

2001లో స్టైల్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌ గా పరిచయం అయింది. లో బడ్జెట్ చిత్రంగా ఎన్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రియా సేన్‌కు గుర్తింపు తెచ్చిన చిత్రాలు షాదీ నంబర్1 - ఝంకర్ బీట్స్ - మలయాళంలో ఆనంతభద్రం చిత్రాలు. దాదాపు 50 చిత్రాలకు పైగా నటించింది. పాల్గుణి పాథక్ రూపొందించిన మ్యూజిక్ వీడియో యాద్ పియా కి ఆనే లగీ అనే వీడియో ఆల్బమ్ నటించడం ద్వారా మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా రూపొందించిన తాజ్ మహల్ చిత్రంలో మంచి పాత్రను ధరించింది. తమిళంలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. కానీ నిలుపుకోలేక పోయింది. తెలుగులో మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడం - బెంగాలీ భాషలో భారీ ఆఫర్లు దక్కడంతో తెలుగు వైపు తిరిగి చూడలేదు.

కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా - హాట్ మోడల్‌ గా కూడా హాట్ రికార్డ్స్ నెలకొల్పింది. లిమ్కా యాడ్‌ లో దీపికా పదుకొనే తర్వాత ఆమె స్థానాన్ని రియా సేన్ కైవసం చేసుకుంది.  కోల్గెట్ - దాబర్ వాటిక - రిలయన్స్ ఇండస్ట్రీస్ - క్యాడ్బరీ డైరీ మిల్క్ - నిర్మా లాంటి ఉత్పత్తులకు మోడల్‌ గా నటించింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఫొటోషూట్‌ లో కూడా హాట్ హాట్‌ గా నటించింది. రియాసేన్ మరోసారి హాట్ ఫోటోలతో కుర్రకారులో సెగలు రేపింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో యాక్టివ్‌ గా ఉండే ఈ భామ.. తరుచూ తన ఫోటోషూట్స్ అందులో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా బికినీలో ఉన్న ఓ ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News