కొంత మంది సినీ తారల ప్రేమ వివాహాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. సడన్ గా పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేస్తారు. రీసెంట్ గా ఇదే స్టైల్ లో ఓ బాలీవుడ్ నటి పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ని ఇచ్చింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు ను తెచ్చుకున్న రియా సేన్. అయితే రీసెంట్ గా ఈ అమ్మడు తన వివాహాన్ని సింపుల్ గా పుణెలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ లో చేసేసుకుంది.
రియా సేన్ గత కొంత కాలంగా శివమ్ తివారి అనే ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తోంది. అయితే ఎక్కువ ప్రచారాన్ని చేసుకోకుండా సైలెంట్ గా తన సంప్రదాయ(బెంగాలీ) పద్దతిలో బుధవారం పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోలని ఈ భామ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ పెళ్ళికి దగ్గరి బంధువులు మాత్రమే వచ్చారట. అలాగే వారి స్నేహితులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. రియాసేన్ గత కొన్నేళ్లుగా శివమ్ తో డేటింగ్ చేస్తోంది. ఆమె ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా బెంగాలీ - తమిళ్-ఒరియా- మలయాళం భాషల్లోని సినిమాలతో పాటు మంచు మనోజ్ "నేనే మీకు తెలుసా" అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. అయితే ఈ అమ్మడు గత కొన్నేళ్ళుగా సినిమాలకు దూరంగానే ఉంది. ప్రేమ వ్యవహారంతో బాలీవుడ్ లో తెగ హల్ చల్ చేసిన రియా ఇలా సీక్రెట్ గా పెళ్లి ఎందుకు చేసుకుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఒక రూమర్ ఏం చెబుతోందంటే.. రియా ఈ మధ్యనే ప్రెగ్నెంట్ అయ్యిందట. అందుకే ఉన్నపలంగా పెళ్ళి చేసేసుకుంది అంటున్నారు. చూద్దాం మరి ఈ యవ్వారంపై ఎంతవరకు స్పందిస్తుందో!!