రాబిన్ హుడ్.. హీరో మారిపోయాడే

Update: 2017-02-10 05:11 GMT
రాబిన్ హుడ్.. ఓ ఏడాది క్రితం ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్. బెంగాల్ టైగర్ సక్సెస్ తర్వాత రవితేజ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. చక్రి అనే కొత్త దర్శకుడు ఈ మూవీని రూపొందిస్తాడని చెప్పారు. ఆ తర్వాత అనుకోకుండా ఈ మూవీ వాయిదా పడిపోయింది.

రవితేజ రెమ్యూనరేషన్ ఇష్యూలు అని.. నిర్మాతలు వెనక్కి తగ్గారని.. ఇలా రకరకాల ఇష్యూలతో ఈ ప్రాజెక్టు సంగతి ఏం తేలలేదు. దాదాపు మళ్లీ ఏడాది తర్వాత.. ఇప్పుడు రాబిన్ హుడ్ మళ్లీ పట్టాలెక్కబోతోందని అంటున్నారు. అయితే.. ఈ సారి హీరో మారిపోయాడు. రవితేజ ప్లేస్ లోకి గోపీచంద్ వచ్చి చేరాడు. గోపీచంద్ హీరోగా చక్రి దర్శకత్వంలోనే రాబిన్ హుడ్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు.

బెంగాల్ టైగర్ సక్సెస్ తో సక్సెస్ సాధించిన సంపత్ నంది దర్శకత్వంలో.. ప్రస్తుతం గౌతమ్ నందా అనే మూవీ చేస్తున్నాడు గోపీచంద్. ఈ మూవీ పూర్తయ్యేనాటికే.. కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందిట. గోపీచంద్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ రాబిన్ హుడ్ అంటున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News