రీసెంట్ గా రిలీజ్ అయిన రోగ్ మూవీ.. పూరీ కెరీర్ లోనే వరస్ట్ అని తీసిపడేశారు జనాలు. ఈ మూవీకి జనాల నుంచి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే.. ఆశ్చర్యం వేయకమానదు. ఏదో ఒక విభాగంలో అయినా.. కనీసం డైలాగ్స్ తో అయిన మురిపిస్తాడని పూరీ పై ఇన్నాళ్లు ఉన్న ఆ కనీస ఆశలు కూడా ఇప్పుడు ఆవిరైపోయినట్లే.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రోగ్ చిత్రాన్ని జనాలు తిరస్కరించేశారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లో అయితే పరిస్థితి మరీ దారుణాతి దారుణంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి నాలుగు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ కేవలం 330 డాలర్లు. ఓ స్టార్ డైరెక్టర్.. అందులోనూ సినిమాకి 6 నుంచి 10 కోట్లు పుచ్చుకునే ఓ దర్శకుడు రూపొందించిన సినిమాకి.. యూఎస్ మార్కెట్లో వచ్చిన కలెక్షన్స్ 22 వేల రూపాయల్లోపే అంటే.. ఈ మూవీని అక్కడి జనాలు ఏ స్థాయిలో తిరస్కరించారో అర్ధమవుతుంది.
ఇప్పటివరకూ యూఎస్ మార్కెట్లో టాలీవుడ్ సినిమా వరస్ట్ రికార్డ్ 80 డాలర్లు. దానితో ఓ స్టార్ డైరెక్టర్ సినిమా పోటీ పడ్డం అంటేనే.. సినిమా పరిస్థితి తెలుస్తోంది. హీరోల కంటే డైరెక్టర్ కి వాల్యూ ఇచ్చి సినిమా చూసే యూఎస్ జనాలు.. పూరీని పూర్తిగా తిరస్కరించేశారని ఫిక్స్ అయిపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/