విజయ్ దేవరకొండ.. రష్మిక జంటగా తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నట్లుగా అప్పటి నుండి వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ అంతకు ముందు చిత్రం అర్జున్ రెడ్డి కూడా హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అందుకే గీత గోవిందం చిత్రంను కూడా హిందీలో రీమేక్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే గీత గోవిందం హిందీ రీమేక్ రైట్స్ విషయంలో కాస్త ఆలస్యం అయ్యిందనిపిస్తుంది.
అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం చిత్రాలు చాలా విభిన్నమైనవి. అర్జున్ రెడ్డి యూనివర్శిల్ సబ్జెక్ట్ కనుక అన్ని చోట్ల సక్సెస్ అవుతుందని అందరి నమ్మకం. కాని గీత గోవిందం చిత్రం రీమేక్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది నమ్మకం లేదు. అందుకే హిందీలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ విషయంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆలోచించారు. చివరకు రోహిత్ శెట్టి ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నట్లుగా ఒక ప్రముఖ జాతీయ దిన పత్రిక కథనంలో పేర్కొనడం జరిగింది.
ఈయన తెలుగు టెంపర్ చిత్రాన్ని హిందీలో సింబాగా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ వద్ద దూకుడు కనబర్చింది. టెంపర్ చిత్రం రీమేక్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు గీత గోవిందం చిత్రాన్ని రీమేక్ చేయాలని దర్శకుడు రోహిత్ శెట్టి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది.