ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి `ఇండియన్ పోలీస్ ఫోర్స్` సెట్స్ లో ప్రమాదవశాత్తూ గాయపడిన తర్వాత అతడి అభిమానులు ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ చిత్రీకరణ సాగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే శెట్టి స్థానిక కామినేని ఆసుపత్రిలో చేరారు. అయితే అతడు వెంటనే డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సెట్స్ కి వెళ్లాడని తెలిసింది.
తాజాగా రోహిత్ శెట్టి తన ఆరోగ్యంపై అప్ డేట్ చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ తారాగణం సిబ్బందితో కలిసి ఉన్న ఒక గ్రూప్ ఫోటోని షేర్ చేసాడు. ``చేతిలో స్టార్లు ఉండొచ్చు!`` అంటూ నవ్వుతూ ఉన్న ఫోటోని షేర్ చేయడంతో సన్నివేశం పై అభిమానులకు క్లారిటీ వచ్చింది. అతడు నిరంతరం సెట్స్ లో ప్రమాదాలకు ఎలా అలవాటు పడ్డాడో ఇప్పుడు అర్థమవుతోంది. శెట్టి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. రోహిత్ శెట్టి తన తాజా పోస్ట్ కి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చాడు. ``మరో కారు బోల్తా... కానీ ఈసారి 2 వేళ్లకు కుట్లు వేశారు. చింతించాల్సిన పని లేదు.. నేను బాగానే ఉన్నాను. మీ ప్రేమ శ్రద్ధకు చాలా ధన్యవాదాలు`` అంటూ హార్ట్ ఈమోజీలను షేర్ చేశారు.
తాజా అప్ డేట్ తో పలువురు అభిమానులు సహా ఇండస్ట్రీ మిత్రులు శెట్టికి శుభాకాంక్షలు తెలియజేశారు. నటుడు నీల్ నితిన్ ముఖేష్ హార్ట్ ఈమోజీలను షేర్ చేయగా.. సర్కస్ స్టార్ రణ్ వీర్ సింగ్ రోహిత్ కు వెచ్చని వర్చువల్ కౌగిలింతను పంపాడు. టీవీ నటి రుబీనా దిలైక్ కూడా ``మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను సార్`` అని వ్యాఖ్యానించారు.
మీడియా కథనాల ప్రకారం.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కార్ చేజ్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు రోహిత్ శెట్టికి గాయం అయ్యింది. టీమ్ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నపాటి సర్జరీ చేయించుకుని రెండు గంటల పాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచి డిశ్చార్జి చేశారు. గత సంవత్సరం రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఇదే వెబ్ సిరీస్ షూటింగ్ లో కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా .. కీలక పాత్రధారి శిల్పాశెట్టి కూడా గాయపడ్డారు.
ఇండియన్ పోలీస్ ఫోర్స్ గురించి..
సింగం- సింగం 2- సింబా- సూర్యవంశీ ఇవన్నీ రోహిత్ శెట్టి తెరకెక్కించిన కాప్ సినిమాలు. వీటన్నిటికీ కొనసాగింపుగా తన కాప్ విశ్వాన్ని విస్తరిస్తూ రోహిత్ శెట్టి భారతదేశంలో మొదటి కాప్ ఆధారిత వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. `ఇండియన్ పోలీస్ ఫోర్స్`లో సిద్ధార్థ్ మల్హోత్రా- శిల్పాశెట్టి- వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.