అల్లు అరవింద్ కు చెందిన అహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో అఖండ విజయంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వంటివారితో పాటు సినిమా హీరోలు సైతం వచ్చి సందడి చేశారు. కాగా అహా రాజకీయంగానూ సంచలనం రేపుతోంది. 1995లో ఎన్టీఆర్ ను ఎలాంటి పరిస్థితుల్లో గద్దె దింపాల్సి వచ్చిందో చంద్రబాబు అహా షోలో బాలయ్యకు వివరించారు. ఇది రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ షోపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడ భవానీ ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాలలో రోజా సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రోజాను మీరు కూడా అన్ స్టాపబుల్ షోకు వెళ్లే అవకాశం ఉందా ప్రశ్నించగా ఆమె ఘాటుగదా స్పందించారు.
అన్ స్టాపబుల్ షో కి వెళ్ళే ఉద్దేశం తనకు లేదన్నారు. చంద్రబాబు ఇంటర్వ్యూ చూసాక ఆ షో మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ను కూడా పిలిచాక ఆ షోకి వెళ్లాలని అనిపించడం లేదన్నారు. అసలు ఆ షోలు కూడా వారు డబ్బుకోసమే చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందులో వారు చెప్పేవి ప్రజలకు తెలియని నిజాలా..? అని ప్రశ్నించారు. అన్ స్టాపబుల్ షోలో బయటపడేవి ఏమి లేవని, ప్రజలకు వారి గురించి బాగా తెలుసన్నారు.
రోజా వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. జబర్దస్త్ కన్నా అన్ స్టాపబుల్ చీపా అని నిలదీస్తున్నారు. అయినా మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే కదా మీరు రాను అని చెప్పడానికి అని ఎద్దేవా చేస్తున్నారు.
గతంలో ఒక కార్యక్రమంలో బాలకృష్ణకు ఫోన్ చేసిన రోజా తన జబర్దస్త్ కు రావాలని కోరగా.. బాలయ్య సమయం చూసుకొని వస్తాను అని చెప్పారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఆయన చేస్తున్న షో గురించి ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నారని రోజాపై మండిపడుతున్నారు. అది బాలయ్యకు, మీకు ఉన్న తేడా.. కొంచెం ఆయనను చూసి నేర్చుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇటీవల రోజా వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల చిరంజీవిపై రోజా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మునిసిపాలిటీ కుప్పకు రోజా నోటికి తేడా లేదని మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ సైతం చివరకు డైమండ్ రాణి రోజా కూడా తనను తిడుతోందని.. చివరకు ఆమె చేత కూడా తిట్టించుకోవాల్సి వస్తుందంటూ ఆమెను తీసిపారేశారు. ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షోపై చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.