సినిమా సక్సెస్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ లో స్టోరీ తర్వాత ప్లేస్ లో పాటలే ఉంటాయి. అందుకే.. సినిమాలో ఆడియోకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ కారణం వల్లే.. మేకర్స్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే.. ఎంత ఎఫర్ట్ పెట్టినా.. కొన్ని పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ.. మరికొన్ని పాటలు మాత్రం ఊహకందని రెస్పాన్స్ సొంతం చేసుకుంటాయి. సంవత్సరాలు గడిచిపోతున్నా.. జోరు తగ్గకుండా దూసుకెళ్తుంటాయి.
కోలీవుడ్ స్టార్ ధనుష్ - నేచురల్ బ్యూటీ సాయిపల్లవి చిందేసిన మారీ చిత్రంలోని 'రౌడీ బేబీ' సాంగ్ ఎంతటి సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ లోని మాస్ బీట్ ప్రతీ ఒక్కరిచేతా చిందేయిస్తుందంటే అతిశయోక్తి కాదు. విడుదలైన రెండున్నర సంవత్సరాల తరువాత కూడా యూట్యూబ్‌లో రౌడీ బేబీ జోరు కొనసాగుతుండడం విశేషం. ఇప్పటి వరకు ఈ సాంగ్ ను 1.1 బిలియన్ల మంది వీక్షించారంటే.. ఈ పాట వీక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో తిరుగులేని చార్ట్ బస్టర్‌గా నిలిచిన రౌడీ బేబీ సాంగ్.. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు.. యూట్యూబ్‌లో 5 మిలియన్ల లైక్‌లు పొందిన మొదటి దక్షిణాది పాటగా నిలిచింది. ఇప్పటివరకు ఏ పాట సైతం ఈ స్థాయిలో ప్రభావం చూపలేదు. యువన్ శంకర్ రాజా యొక్క మ్యూజికల్ ట్రాక్ కు అద్దిరిపోయే మూమెంట్స్ ను కంపోజ్ చేశారు డ్యాన్స్ మాస్టర్స్. ఈ పాటకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా, జానీ మాస్టర్ సంయుక్తంగా కొరియోగ్రఫీ చేశారు. యువన్ మ్యూజిక్ కు ధీటుగా ఆన్ స్క్రీన్ ధనుష్, రౌడీబేబీ సాయిపల్లవి వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరినీ అలరించాయి. ఇప్పటికీ.. అలరిస్తూనే ఉన్నాయి. ఆడియో వెర్షన్ కన్నా.. వీడియో వెర్షన్ సోషల్ మీడియాలో దుమ్ములేపింది.
ఇక, ఈ పాట తర్వాత.. టాలీవుడ్ సాంగ్ నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కు ముందు విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం విజయంలో పాటలు ఎలాంటి రోల్ ప్లే చేశాయో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని అద్భుతమైన ఆల్బమ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గిటార్ నుంచి జాలువారింది. ప్రతీ పాట.. అంతకు మించి అన్నట్టుగా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అది ఎంతలా అంటే.. టాలీవుడ్ లోనే కాకుండా, ఏకంగా సౌత్ ఇండియాలోనే అగ్రస్థానంలోకి దూసుకెళ్లంతలా!
గతేడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 12న రిలీజ్ అయ్యిందీ మూవీ. రిలీజ్ కు ముందు ఒక్కొక్క పాటను విడుదల చేసింది యూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించింది. ఇక, ఈ సినిమా పాటలు రచ్చ రంబోలా చేసేశాయి. ఈ ఆల్బమ్ లోని “బుట్ట బొమ్మా.. బుట్ట బబొమ్మా” అనే బీట్ కు.. యావత్ ప్రేక్షకలోకం చిందేసింది. బయట కాలు కదపలేనివారు కూడా మనసులో డ్యాన్స్ చేసేశారు. అలాంటి సాగ్.. యూ ట్యూబ్ లో రికార్డు సాధించింది. అటు లిరికల్ సాంగ్ తోపాటు ఫుల్ వీడియో సాంగ్ కూడా నెవ్వర్ బిఫోర్ వ్యూస్ ను నమోదు చేసింది.
ఈ పాట ఇప్పటి వరకు 644 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 4.1 మిలియన్ల లైకులు సాధించింది. టాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ సాంగ్ గా నిలిచింది. సౌత్ లో రౌడీ బేబీ సాంగ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ విధంగా ఈ రెండు పాటలు రెండేళ్లుగా ఊపేస్తూ.. దూసుకెళ్తున్నాయి. మరి, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఫీట్ నమోదు చేస్తాయో చూడాలి.