ఆ డైరెక్టర్ నన్ను వాష్ రూమ్ లో లాక్ చేశాడు: ఆర్పీ

Update: 2022-05-17 10:30 GMT
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'సంతోషం' ఒకటి. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చారు. మ్యూజికల్  హిట్ గా నిలిచిన ఈ సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికర్తమైన సంఘటనను గురించి ప్రస్తావించారు. 'గలగల గోదారిలా ..' అనే ఒక పాటను ఈ సినిమా కోసం కంపోజ్ చేశాను. ఆ పల్లవికి ఏం పిక్చరైజ్ చేయాలనేది నాకు అర్థం  కావడం లేదంటూ రాజు సుందరం గారు షూటింగు మొదలు పెట్టలేదు.

ఆ సమయంలో దశరథ్ కాల్ చేయగానే నేను లొకేషన్ కి వెళ్లాను. అక్కడ షూటింగు ఆగిపోయి అందరూ టెన్షన్ తో ఉన్నారు. పల్లవి మారిస్తేనే తప్ప రాజు సుందరం డాన్స్ కంపోజ్ చేయనంటున్నాడని చెప్పారు.

హీరో హీరోయిన్లు .. డాన్సర్లు .. అంతా కూడా ఊటీలో వెయిటింగ్. దశరథ్ కి ఫస్టు సినిమా కావడంతో చాలా టెన్షన్ తో ఉన్నాడు. దాంతో నేను కులశేఖర్ కి కాల్ చేశాను .. ఆయనకి విషయం చెప్పి మరో పల్లవి రాయమని చెప్పాను.  కానీ అంత సమయం లేదు .. మనమే ఏదో ఒకటి చేయాలని దశరథ్ అన్నాడు.

ఆ సమయంలో నేను వాష్ రూమ్ కి వెళ్లాను .. అంతే బయట నుంచి దశరథ్ గడియ పెట్టేశాడు. పల్లవి చెబితేనే డోర్ తీస్తానని అన్నాడు. 'దేవుడే దిగి వచ్చినా .. స్వర్గమే రాసిచ్చిన' అనే లైన్ చెప్పాను. మిగతా లైన్లు అవే వస్తాయి .. ఇక రా అని చెప్పేసి డోర్  ఓపెన్ చేశాడు.

ఆ తరువాత  ఇద్దరం కలిసి పల్లవి రెడీ చేశాం. అలా ఆ సమయంలో ఇద్దరం చాలా టెన్షన్  పడిపోయాము. ఆ తరువాత ఆ పాట ఎంత సూపర్ హిట్ అయిందనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్  చేస్తే బాగుంటుందని ఆ తరువాత  చాలామంది అన్నారు. కానీ క్లాసికల్ సినిమాలకి సీక్వెల్  చేయకూడదనే ఉద్దేశంతో దాని జోలికి వెళ్లలేదు.

ఈ సినిమా సమయానికి నాకు కారు కూడా లేదు. మిత్రుడు చందూ కారులో అలా ఒక రౌండ్ వేస్తూనే ట్యూన్ కట్టేయడం జరిగింది. అప్పట్లో ఇంత ట్రాఫిక్ యూ ఉండేది కాదు గనుక .. గండిపేట వైపు అలా వెళ్లి వచ్చేవాళ్లం. ఆలోగా ట్యూన్స్ అయ్యేవి.  సాధారణంగా నేను సంగీతాన్ని సమకూర్చిన సినిమాలకి ఒకటి రెండైనా పాటలను నేను పాడుతూ ఉంటాను. కానీ 'సంతోషం' సినిమాలో మాత్రం నేను ఒక్క పాట కూడా పాడలేదు. ఈ సినిమాను గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News