ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా సంగీత దర్శకుడు సోషల్ మీడియాలో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. అనిరుథ్ తో వర్క్ అతడి టీమ్ పై కీరవాణి ప్రశంసలు కురిపించాడు. జక్కన్న తో ఇప్పటి వరకు కీరవాణి కాకుండా మరో సంగీత దర్శకుడు వర్క్ చేయలేదు. ఎట్టకేలకు అనిరుథ్ కు ఆ అవకాశం దక్కింది. ప్రమోషనల్ సాంగ్ స్పెషలిస్ట్ గా పేరు దక్కించుకున్న అనిరుథ్ ఆర్ ఆర్ ఆర్ కోసం మంచి సాంగ్ ను ట్యూన్ చేసి ఉంటాడని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ అనిరుథ్ విషయమై క్లారిటీ ఇచ్చింది.
కీరవాణి చేసిన ట్వీట్ కు ఒక నెటిజన్ స్పందిస్తూ అనిరుథ్ కేవలం తమిళ వర్షన్ కు మాత్రమే సంగీతాన్ని అందించి ఉంటాడు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కు ఆర్ ఆర్ ఆర్ చిత్ర అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఔను అన్నట్లుగా సమాధానం ఇచ్చారు. అంటే అనిరుథ్ తమిళ వర్షన్ ప్రమోషనల్ సాంగ్ కు మాత్రమే ట్యూన్స్ అందించి ఉంటాడని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే వేరు వేరు భాషలకు వేరు వేరుగా ప్రమోషనల్ సాంగ్ ను రూపొందించి ఉంటారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా సాంగ్స్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి అందరిలో ఉంటుంది. అందుకే ఈ సినిమా పాటల విషయంలో కూడా అంతా చాలా ఆసక్తిగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. రాజమౌళి ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రమోషనల్ సాంగ్ లో కొత్త ఒరవడిని ఆయన తీసుకు వస్తున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనిరుథ్ ఆర్ ఆర్ ఆర్ లో భాగస్వామ్యం అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు.. అది కూడా తమిళ వర్షన్ వరకే అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొమురం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో కనిపించబోతున్నారు. కొమురం భీమ్ మరియు అల్లూరి ల గురించి తెలిసిన కథ కాకుండా ఫాంటసీ కథతో సినిమాను రూపొందిస్తున్నట్లుగా జక్కన్న పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. దేశ భక్తి సినిమా అని చెబుతూనే ఇది స్వాతంత్ర్య ఉద్యమ కాలం నాటి సినిమా కాదు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అక్టోబర్ లో దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
థర్డ్ వేవ్ లేకుంటే సినిమాను అక్టోబర్ లో ఖచ్చితంగా విడుదల చేస్తారని నమ్మకంగా అంతా ఉన్నారు. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు కీలక పాత్రలో నటించడం వల్ల అక్కడ కూడా సినిమా కు భారీగా క్రేజ్ ఉంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ను ముగించేసిన యూనిట్ సభ్యులు విడుదల తర్వాత ఎన్ని వందల కోట్లు వసూళ్లు అవుతాయా అంటూ ఆసక్తిగా ప్రేక్షకులతో పాటు ఎదురు చూస్తున్నారు.