హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల్లో RRR హ‌వా!

Update: 2022-12-18 05:30 GMT
పాన్-ఇండియన్ బ్లాక్ బస్టర్ RRR ఈ ఏడాది గూగుల్ లో అత్య‌ధికంగా ట్రెండ్ అయిన టైటిళ్ల‌లో ఒక‌టి. అంత‌గా ఈ మూవీ గురించి ప్ర‌పంచ దేశాల్లో సెర్చ్ కొన‌సాగింది. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 1000 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం ఇటీవ‌లే జపాన్ లోను విడుద‌లై అక్క‌డ‌ అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఈ చిత్రం త‌దుప‌రి ఆస్కార్ బ‌రిలోను నిలుస్తోంది. అంత‌కంటే ముందే ప‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను ఖాతాలో వేసుకుంటోంది.

తాజా స‌మాచారం మేర‌కు  ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ లో RRR నాలుగు నామినేషన్లను పొందింది.
ఉత్తమ దర్శకుడు- ఉత్తమ చిత్రం- ఉత్తమ యాక్షన్ చిత్రం - ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం అవార్డులకు నామినేట్ అయినట్లు అసోసియేష‌న్ అధికారిక ట్విట్టర్ లో వెల్ల‌డించింది.

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ఈ ఏడాది మార్చి 24న విడుదలైంది. దాదాపు 550 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ డ్రామా ఇది. ఇందులో బాలీవుడ్ తార‌లు అలియా భట్- అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలు పోషించారు. విడుదలైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్రిటీష్ థియేట‌ర్ల‌లోను ఆర్.ఆర్.ఆర్ అసాధార‌ణంగా ఆడుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల్లో నామినేషన్ల ఫ‌ర్వంతో మూవీ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఇటీవ‌లే ప్ర‌తిష్ఠాత్మ‌క‌ గోల్డెన్ గ్లోబ్స్ మ్యూజిక్ అవార్డుల్లో ప‌లు విభాగాల‌కు నామినేట్ అయిన సంగ‌తి  తెలిసిందే.

#HCA  నామినేషన్లకు అర్హ‌త క‌ల్పించినందుకు  జ్యూరీకి మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు. RRR అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ``నామినేషన్ స్ప్రీ కొనసాగుతోంది! #RRR #HCA ఫిల్మ్ అవార్డ్స్ లో 4 నామినేషన్లను పొందింది! #RRR ని గుర్తించినందుకు జ్యూరీకి చాలా ధన్యవాదాలు``అని తెలిపారు. అభిమానులు ఈ శుభ‌వార్త విని చిత్ర తారాగణం - సిబ్బందిని అభినందించారు.  ఆర్.ఆర్.ఆర్ ప్ర‌స్తుతం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్.. నెట్ ఫ్లిక్స్ వంటి వేదిక‌ల‌పై నా ZEE5లోను అందుబాటులో ఉంది.

గోల్డెన్ గ్లోబ్స్ లో స‌త్తా చాటాలి:

RRR గోల్డెన్ గ్లోబ్స్ కు నామినేట్ అయింది. ఈ నెల ప్రారంభంలో నిర్మాతలు ఈ చిత్రం 2023 గోల్డెన్ గ్లోబ్స్ లో ఉత్తమ చిత్రం కేట‌గిరీలో రెండు నామినేషన్లను కైవసం చేసుకున్నట్లు ప్రకటించారు. నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు)- బెస్ట్ మోషన్ పిక్చర్ కేటగిరీలు. అలాగే ఈ చిత్రం క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ 2023లో ఐదు నామినేషన్లు పొందింది. జేమ్స్ కామెరూన్ `అవతార్: ది వే ఆఫ్ వాటర్` సైతం ఈ వేదిక‌పై పోటీదారులలో ఒకటి గా ఉంది.

ఆస్కార్ అవార్డుల బ‌రిలో
RRR ఆస్కార్ అవార్డుల‌ రేసులోను ఉంది. అకాడెమీ అవార్డుల జూరీ పరిశీలన కోసం 15 కేటగిరీలలో బ‌రిలో దించారు. వాటిలో ఉత్తమ చలన చిత్రం- ఉత్తమ దర్శకుడు (రాజమౌళి)- చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లకు ఉత్తమ నటుడు...., ఉత్తమ సహాయ నటుడు (దేవగన్),... ఉత్తమ సహాయ నటి (భట్), ...నాటు నాటుకు ఉత్తమ ఒరిజినల్ పాట .. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే (రాజమౌళి, వి. విజయేంద్ర ప్రసాద్, సాయి మాధవ్ బుర్రా) తదితరులు ఉన్నారు.
Tags:    

Similar News