యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం) ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 13న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ చిత్రీకరణ ఆలస్యమవుతోంది.
ఇదిలా ఉండగానే ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్ డేట్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద పులితో పోరాడే సన్నివేశం ఆద్యంతం రక్తి కట్టిస్తుందని ప్రచారమైంది. ఇప్పుడు భీమ్ పాత్రధారి పై ప్రేమకథ ఎంతో గొప్పగా కుదిరిందని మరో లీక్ అందింది.
నాడు బ్రిటీష్ వారికి ఎదురెళ్లి పోరాడి మరణించిన గొప్ప గిరిజన వీరుడు కొమరం భీమ్. అయితే ఆయన జీవితంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అందులో ఒకరు బ్రిటీష్ యువతి. ఒకరు గిరిజన యువతి. ఆ ఇద్దరు యువతులతో భీమ్ ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుందట. అడవి జాతి ముద్దుబిడ్డ భీమ్ ప్రేమాయణం హిస్టరీలో పొందుపరచబడి ఉంది. దానిని తెరపై అద్భుతంగా అందమైన దృశ్యకావ్యంలా మలిచారట జక్కన్న. ఇద్దరు నాయికలతో ఎన్టీఆర్ గొప్ప లవ్ స్టోరీ రక్తి కట్టిస్తుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో దేశభక్తునిగా అజయ్ దేవగన్ పాత్ర ఆకట్టుకోనుంది. సముదిరకని.. శ్రీయ తదితరులు నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో నిర్మాతలు ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ అందుకున్నారని కథనాలొచ్చాయి.