కరోనా నేపథ్యంలో ఎప్పుడు ఏ సినిమా థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడం.. మళ్ళీ వాయిదా వేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల తేదీలను ఫిక్స్ చేయడం పెద్ద సమస్యగా మారుతోంది. వీటి వల్ల మిగతా చిత్రాల రిలీజులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని అనేక వాయిదాల అనంతరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. దీంతో 'సర్కారు వారి పాట' 'భీమ్లా నాయక్' 'ఎఫ్ 3' వంటి చిత్రాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. చివరకు కరోనా థర్డ్ వేవ్ కారణంగా RRR మూవీని రిలీజ్ చేయలేకపోయారు.
ఈ క్రమంలో సిని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ చిత్రానికి రెండు విడుదల తేదీలను ఖరారు చేసారు. పరిస్థితులను బట్టి మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో మార్చిలో అదే సమయంలో రావలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. అయితే మేకర్స్ ఇప్పుడు రెండో తేదీనే ఫైనల్ చేయాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఏప్రిల్ నాటికి వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గి.. అన్ని రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే నెల 28న RRR చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఏప్రిల్ 28ని ఇది వరకే 'ఎఫ్ 3' సినిమా కోసం లాక్ చేశారు. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' అదే డేట్ కి వస్తానని చెప్పడంతో మరో తేదీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం RRR వస్తానంటే ఎవరైనా రిలీజ్ డేట్స్ ని త్యాగం చేయాల్సిందేనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'ఎఫ్ 3' తో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ట్రిపుల్ ఆర్ కారణంగా వాయిదా పడే పరిస్థితి వచ్చింది. పాన్ ఇండియా చిత్రానికి ముందూ వెనుక రెండు వారాల గ్యాప్ చూసుకొని కొత్త తేదీలను ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఇలా రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసే అనేక చిత్రాల విడుదలలో గందరగోళం క్రియేట్ చేసిన 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఒకవేళ సమ్మర్ నాటికి పరిస్థితులు సానుకూలంగా లేకపోతే ఏం చేస్తారని అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో పెద్ద చిత్రాల విడుదల తేదీల విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారనేది స్పష్టం అవుతోంది