రాజమౌళి ఒక సినిమాను రూపొందిస్తున్నాడంటే ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఒక ఆసక్తి మొదలవుతుంది. అందుకు కారణం 'బాహుబలి' సినిమాతో ఆయన పేరు ప్రఖ్యాతులు సరిహద్దులు దాటడమే. రాజమౌళికి జక్కన్న అనే పేరు కరెక్టుగా సరిపోతుంది. ఎందుకంటే చివరి నిమిషం వరకూ ది బెస్ట్ ఇవ్వడానికి ఆయన తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక కథను అన్ని వైపుల నుంచి అల్లుకు రావడం .. ప్రతి పాత్రకి ఒక ప్రయోజనం .. ప్రాధాన్యత ఉండేలా చూడటం ఆయన ప్రత్యేకత. పాత్రల స్వభావానికి తగినట్టుగా ఆయన ఆ పాత్రల లుక్ ను డిజైన్ చేసే తీరు, ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది.
అందుకు నిదర్శనంగా 'బాహుబలి' సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలోని పాత్రలకి సంబంధించిన టాయ్స్ మార్కెట్ లోకి వచ్చాయంటే. ఆయన ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరే కారణమని చెప్పాలి. అలాంటి రాజమౌళి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధాన పాత్రధారులుగా ఆయన ఈ సినిమాను రూపొందించారు. చరిత్రకి కొంత కల్పనను జోడించి ఆయన ఈ కథను సిద్ధం చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. అయితే హిందీలో మరింత భారీస్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందువలన అక్కడి ప్రమోషన్స్ పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్కడ ఒక రేంజ్ లో నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తేదీని రాజమౌళి లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్టుగా రానున్నట్టుగా చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది. చిరంజీవి - బాలకృష్ణ ముఖ్య అతిథులుగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ముంబైలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఆ రోజున అక్కడ పండుగ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయని అంటున్నారు.
బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించారు. జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ రోజు కోసమే ఇటు నందమూరి అభిమానులు .. అటు మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సరికొత్త సంచలనాన్ని సృష్టించడం ఖాయమనేది అభిమానుల నమ్మకం.