బాహుబలిని మించి ఆర్‌ఆర్‌ఆర్‌... జక్కన్న ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Update: 2022-09-17 00:30 GMT
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సృష్టించిన అద్భుతాలు బాహుబలి మరియు ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమా స్థాయిని కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లాయి అనడంలో సందేహం లేదు. తాజాగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా యూనిట్‌ కి ప్రపంచ ప్రఖ్యాత టొరంటో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నుండి ఆహ్వానం అందింది.

రాజమౌళితో పాటు ఆయన తనయుడు కార్తికేయ మరియు కొందరు యూనిట్‌ సభ్యులు వెళ్లారు. అక్కడ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన పలు విషయాలను జక్కన్న అక్కడి వారితో చర్చించారు. ఆయన ఒక చర్చ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ఈ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటుందని... ఓటీటీ లో విడుదల అయిన తర్వాత ఈ స్థాయి ప్రశంసలు అందుకుంటుందని తాను భావించలేదు అన్నాడు.

బాహుబలి సినిమాను ఇండియాలో చూడటంతో పాటు జపాన్ లో కూడా అత్యధికులు చూశారు. కానీ ఈ సినిమాను హాలీవుడ్‌ సినిమా స్థాయిలో అత్యధిక శాతం హాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులు చూశారంటూ జక్కన్న పేర్కొన్నాడు. ఇప్పటికి అమెరికాలో ప్రత్యేక షో లు వేస్తే జనాలు భారీ ఎత్తున రావడం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందని జక్కన్న పేర్కొన్నాడు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ విజయం.. సినిమాకు దక్కుతున్న ప్రశంసలు నిజంగా తనకు సర్‌ ప్రైజింగ్‌ గా అనిపిస్తుందన్నాడు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఒక విజువల్‌ వండర్‌ గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమా ఆస్కార్‌ నామినేషన్స్ ను దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది అంటూ అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలు చాలా నమ్మకంగా చెబుతున్నాయి. నాలుగు అయిదు కేటగిరీల్లో ఆర్ ఆర్‌ ఆర్‌ ఆస్కార్‌ నామినేషన్స్ దక్కించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News