RRR 1000 కోట్లు కొల్ల‌గొడుతుందా?

Update: 2022-04-02 09:48 GMT
సంచ‌ల‌నాల RRR బాక్సాఫీస్ వ‌ద్ద రెండో వారంలోనూ అదే జోష్ చూపిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం  ప్రపంచవ్యాప్తంగా ప్రారంభ వారంలో 710 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. సుమారు 400కోట్ల షేర్ అంచ‌నా వెలువ‌డింది. ఎస్ఎస్ రాజమౌళి తెర‌కెక్కించిన మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ డ్రామా RRR బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ వ‌సూలు చేస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.

ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 710 కోట్లు వ‌సూలైంద‌ని ట్రేడ్ వెల‌ల్డించింది. ఇది ఇప్పటి వరకు అత్యధిక వ‌సూళ్ల చిత్రంగా నిలుస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం బాహుబలి 2తో పోటీ పడి ముందుకెళుతోందని క‌థ‌నాలొస్తున్నాయి. ఇది ప్రభాస్ - రాజమౌళి కాంబో చిత్రాలు మినహా ఇత‌ర భారతీయ చిత్రాల జీవితకాల కలెక్షన్ లను (చైనీస్ రన్ మినహా) జూమ్ చేసింది. చ‌రిత్ర సృష్టించింది.

ఈ చిత్రం ఓవర్సీస్ బెల్ట్ లో సుమారుగా $21 మిలియన్లు (రూ. 160 కోట్లు) వసూలు చేసింది. అయితే దేశీయ బెల్ట్ మొత్తం రూ. 560 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలో ఉత్తమ వ‌సూళ్ల‌తో అగ్ర‌భాగంలో నిలిచింది. సుమారు రూ. 250 కోట్లుగా ఈ రికార్డు ఉంది. హిందీ వెర్షన్ ఓపెనింగ్ వీక్ గ్రాస్ రూ. 154 కోట్లు. కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల నుంచి మరో రూ. 100 కోట్లు వ‌సూలు కాగా.. మిగిలిన మార్కెట్లలో మొత్తం రూ. 50 కోట్లు వ‌సూలైంద‌ని ట్రేడ్ చెబుతోంది.

ఓవర్సీస్ బెల్ట్ లో బ్రేక్ ఈవెన్‌కు చేరువలో ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హంగామా సృష్టిస్తోంది. హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్లు కూడా  కొద్ది రోజుల్లో బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటారు. ఆపై ఆంధ్ర ప్రదేశ్ .. తెలంగాణలలోని డిస్ట్రిబ్యూటర్లకు ఫినిషింగ్ కోసం ఇది రేసింగులోకి వెళుతోంది. RRR ఫుల్ ర‌న్ ని ముగించే సమయానికి ప్రతి వాటాదారుడు సేఫ్ జోన్ లో ఉండాలనే ఆశ‌తో ఉన్నారు. రెండో వారాంతంలో కేరళ.. తమిళనాడు-క‌ర్నాట‌క‌లో కూడా విజయాల మార్కును తాకనుంది. రెండవ వారాంతం నుండి హిందీ వెర్షన్ ప‌రంగా RRR ఉత్తమ ట్రెండింగ్ లో ఉంది. హిందీ మార్కెట్ క్యాష్ రీచ్ విష‌యంలో ఒక కామ‌ధేనువునే త‌ల‌పిస్తోందంటూ టాక్ వినిపిస్తోంది. ఇది ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉత్త‌మ రిజ‌ల్ట్ ని ఇస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అల్లూరి సీతారామ‌రాజు- కొమ‌రం భీమ్ పాత్ర‌ల్లో చ‌ర‌ణ్ .. తార‌క్ న‌టించారు. బ్రిటీష్ నేప‌థ్యాన్ని స్వాతంత్య్రోద్య‌మ స్ఫూర్తిని తెర‌పై ఫిక్ష‌న‌ల్ కోణంలో ర‌గిలించ‌డం అన్న‌ది కొత్త ఎలిమెంట్. ఎమోష‌న్స్ ని క్యారీ చేయ‌డంలో రాజ‌మౌళి పెద్ద స‌క్సెస‌య్యార‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు. రాజ‌మౌళి బ్రాండ్ మాస్ ఫిలిం ఇది. భారీ యాక్ష‌న్ గ్రాఫిక్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.
Tags:    

Similar News