ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరపైకి వచ్చిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఘన విజయాన్ని సొంతం చేసుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గా కనిపించారు.
సినిమా విడుదలై థియేటర్స్ లో దాదాపు పన్నెండు వందల కోట్ల కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే యాభై రోజుల తర్వాత కూడా ఈ సినిమా అదే తరహాలో ఓటీటీ లో కూడా సందడి చేస్తూ ఉండడం విశేషం. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ కు కూడా భారీగా ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే అత్యధిక వ్యూవర్షిప్ ను సొంతం చేసుకున్న ఇండియన్ సినిమాగా RRR రికార్డులు క్రియేట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇప్పుడు 50 దేశాల్లో ఈ సినిమా ట్రెండింగ్ లిస్టులో చేరిపోయి నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేసింది. అసలేం ఇటీవల కాలంలో నెట్ ఫ్లిక్స్ కు ఇండియా లో భారీగా ఆదరణ తగ్గిందని విదేశాల్లో కూడా అంతగా లాభాలు ఏమి రావడం లేదు అని ఆ సంస్థ కొంత అప్సెట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు RRR సినిమాతో మాత్రం మళ్ళీ నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది.
ఇక విదేశీయులు కూడా RRR సినిమాను చూసి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వారి రివ్యూలు కూడా అందిస్తున్నారు. కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా RRR ఓటీటీలో కూడా సంచలన విజయాన్ని అందుకోవడం విశేషం.
ఇక జి 5 లో RRR సినిమా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదలైన విషయం తెలిసిందే. కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన హిందీ వెర్షన్ లోనే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ దక్కుతుండడం విశేషం.